రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్.. సెంచరీతో జట్టును ఆదుకున్న హిట్‌మాన్
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.

Rohit Sharma scores century on day 1 of Rajkot Test
Rohit Sharma Century: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది 11వ సెంచరీ కాగా, ఇంగ్లండ్‌పై ఓపెనర్‌గా మూడో సెంచరీ. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను కెప్టెన్ ఇన్నింగ్స్ తో రోహిత్ శర్మ ఆదుకున్నాడు. యశస్వి జైస్వాల్(10), శుభ్‌మన్ గిల్(0), రజత్ పటిదార్(5) విఫలం కావడంతో కష్టాల్లో పడిన జట్టును ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు.
వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ మంచి భాగస్వామ్యం నమోదు చేయడంతో టీమిండియా కోలుకుంది. ఈ క్రమంలో ముందుగా రోహిత్ శర్మ ముందుగా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత జడేజా కూడా హాఫ్ సెంచరీ చేశాడు. 97 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ సాధించాడు. 62 ఓవర్లలో 230/3 స్కోరుతో టీమిండియా ఆట కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 125, జడేజా 83 పరుగులతో ఆడుతున్నారు.
అత్యధిక సిక్సర్లు.. సెకెండ్ ప్లేస్ లో రోహిత్
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ(80) రెండో స్థానంలో నిలిచాడు. వీరేందర్ సెహ్వాగ్(90) అతడి కంటే ముందున్నాడు. ఎంఎస్ ధోని (78), సచిన్ టెండూల్కర్ (69), రవీంద్ర జడేజా (61), కపిల్ దేవ్(61) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్లు
233 – ఇయాన్ మోర్గాన్
212 – రోహిత్ శర్మ
211 – ఎంఎస్ ధోని
171 – రికీ పాంటింగ్
170 – బ్రెండన్ మెకల్లమ్