IPL 2024: 20 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్

పూరణ్ 63, స్టోయినిస్ 3, కృనాల్ పాండ్యా 2 పరుగులు చేశారు.

IPL 2024: 20 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్

RR

Updated On : March 24, 2024 / 7:46 PM IST

RR vs LSG: ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 20 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు విజయ దుందుభి మోగించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్.

రాజస్థాన్ బ్యాటర్లలో జైస్వాల్ 24, బట్లర్ 11, శాంసన్ 82 (నాటౌట్), పరాగ్ 43, హెట్మర్ 5, ధ్రువ్ 20 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు స్కోరు 20 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 193గా నమోదైంది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2, మోషిన్ ఖాన్, రవి బిష్ణోయి ఒక్కో వికెట్ తీశారు.

లక్నో బ్యాటర్లలో డికాక్ 4, కేఎల్ రాహుల్ 58, పడిక్కల్ 0, ఆయుష్ 1, దీపక్ హూడా 26, పూరణ్ 64 (నాటౌట్), స్టోయినిస్ 3, కృనాల్ పాండ్యా 3(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో జట్టు స్కోరు 20 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 173గా నమోదైంది. రాజస్థాన్ బౌలర్లలో బోల్ట్ 2, బర్గర్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.

రాజస్థాన్‌ జట్టు
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్‌మయేర్, ధ్రువ్‌ జురెల్, రియాన్‌ పరాగ్‌, అశ్విన్, ట్రెంట్‌ బౌల్ట్, చాహల్‌, సందీప్ శర్మ, అవేశ్‌ ఖాన్‌

లక్నో జట్టు
పడిక్కల్‌, డికాక్, ఆయుష్‌, కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), పూరన్, స్టొయినిస్‌, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మోహ్సిన్‌ ఖాన్, నవీనుల్ హక్, యశ్‌ ఠాకూర్‌

IPL 2024 : కేకేఆర్ జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన హర్షిత్ రానాకు బిగ్‌షాక్‌!