చేధనలో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ 5వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టీవ్ స్మిత్ నేతృత్వంలో ఐపీఎల్ 12లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని ముద్దాడింది. 162 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన స్మిత్.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో బాధ్యతాయుతంగా ఆడాడు. 48 బంతుల్లోనే 5 ఫోర్లు, 1సిక్సు బాది 59 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్‌తో చక్కటి భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు చక్కటి స్కోరు అందించాడు.
ఓపెనర్ రహానె(12)తో కలిసి శుభారంభాన్ని నమోదు చేసిన రాజస్థాన్.. ఆరంభం నుంచి దూకుడుగానే కనిపించింది. సంజూ శాంసన్(35; 19బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సు) మెరుపులతో ఆదిలోనే పుంజుకోవడంతో ముంబై ఇండియన్స్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. బెన్ స్టోక్స్(0), రియాన్ పరాగ్(43; 29 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సు)తో చక్కటి స్కోరు అందించాడు.
Also Read : IPL 2019: బెయిర్ స్టోకు చెన్నైతోనే చివరి మ్యాచ్
చివర్లో స్టువర్ట్ బిన్నీ(7)తో జోడీగా స్మిత్ జట్టుకు విజయాన్ని అందించారు. ముంబై బౌలర్లలో బుమ్రా 1, రాహుల్ చాహర్ 3వికెట్లు తీయగలిగారు.
ముంబై ఇన్నింగ్స్:అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ .. ఓపెనర్‌గా దిగిన క్వింటన్ డికాక్(65) ఒక్కడే జట్టుకు చక్కని స్కోరు అందించగలిగాడు. 14.3ఓవర్లు వరకూ నిలిచిన డికాక్.. శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ క్యాచ్ అందుకోవడంతో అవుట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ తొలి వికెట్‌గా రోహిత్ శర్మ(5)పరుగులు మాత్రమే చేసి శ్రేయాస్ చేతికి చిక్కాడు.
ఆ తర్వాత మూడో వికెట్ గా బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్(34)ను స్టువర్ట్ బిన్నీబౌలింగ్‌లో ధావల్ కుల్కర్ణి క్యాచ్ అందుకోవడంతో వికెట్ చేజిక్కించుకుంది రాజస్థాన్. హార్దిక్ పాండ్యా(23), కీరన్ పొలార్డ్(10), బెన్ కటింగ్(13), కృనాల్ పాండ్యా(2)లు మాత్రమే చేయగలిగారు. శ్రేయాస్ గోపాల్ 2 వికెట్లు దక్కించుకోగా, స్టువర్ట్ బిన్నీ, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉన్దక్త్ తలో వికెట్ చేజిక్కించుకున్నారు.