నా ముందు ఏ గ్రౌండ్ అయినా చిన్నదే..
ఐపీఎల్ సీజన్ 12లో మరోసారి రస్సెల్ మెరిసి సత్తా చాటాడు.

ఐపీఎల్ సీజన్ 12లో మరోసారి రస్సెల్ మెరిసి సత్తా చాటాడు.
ఐపీఎల్ సీజన్ 12లో మరోసారి రస్సెల్ మెరిసి సత్తా చాటాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుపై కోల్ కతా ఆడిన సమరంలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది నైట్ రైడర్స్. ఈ పోరులో దాదాపు అసాధ్యమైన విజయాన్ని కోల్ కతా దక్కించుకుంది. ఆఖరి 22 బంతుల్లో 64 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆ సమయంలో బ్యాటింగ్ కు దిగిన రస్సెల్ చావోరేవో అన్నట్లుగా ఆడి మెరుపులు కురిపించాడు.
Read Also : ఆర్బీబీ పతనమయ్యేలా చేసిన హైదరాబాద్ ప్లేయర్
13 బంతుల్లో 48 పరుగులతో జట్టును గెలిపించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రస్సెల్ మాట్లాడుతూ.. ‘నేను బ్యాటింగ్ కు వెళ్లేముందు కాన్ఫిడెంట్ గానే ఉన్నా. దినేశ్ కార్తీక్ నాతో ముందుగా కొన్ని బాల్స్ ఆడి పిచ్ ఎలా ఉందో గమనించమన్నాడు. కానీ, నేను టీవీలో అప్పటికే మ్యాచ్ జరుగుతున్న తీరును పరిశీలించాను. 20 బంతుల్లో 68 పరుగులు సాధించడం అసాధ్యమైన పనే. అయినప్పటికీ 20 ఓవర్ల ఫార్మాట్ లో ఏ ఒక్క ఓవర్ అయినా మ్యాచ్ ఫలితాన్ని మార్చేయొచ్చు. అందుకే ఓటమిని ఒప్పుకోలేదు’
‘చేయాల్సిన పరుగులు చాలా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వెంటనే పోరాడాల్సి ఉంది. మా వాళ్ల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. ఏ గ్రౌండ్ అయినా నాకు చిన్నదిగానే కనిపిస్తుంది. నాలో ఉన్న పవర్ ను నమ్ముకున్నా. వస్తున్న ఫుల్ టాస్ లను సమర్థంగా ఎదుర్కొన్నా. బంతులను ఎలా ఎదుర్కొన్నానేది చెప్పలేను కానీ, మైదానంలో చూపించగలిగా’ అని రస్సెల్ తెలిపాడు.
రాజస్థాన్ వేదికగా నైట్ రైడర్స్ ఏప్రిల్ 7న రాజస్థాన్ రాయల్స్ తో రాత్రి 8గంటల నుంచి ఆడనుంది.
Read Also : తెలివి వాడితే బాగుండేది: బౌలర్లపై కోహ్లీ స్పందన