Ruturaj Gaikwad startled after bus door shuts in his face
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. భారత జట్టు గెలుపొందినప్పటికీ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. దీంతో రుతురాజ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
జొహానెస్‌బర్గ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి సపారీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో సౌతాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది. సఫారీ బ్యాటర్లలో ఫెహ్లుక్వాయో (33), టోనీ డి జోర్జి (28) లు మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా, అవేశ్ ఖాన్ నాలుగు, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.
Naveen Ul Haq : నవీన్ ఉల్ హక్ పై 20 నెలల నిషేదం.. మ్యాంగో మ్యాన్ చేసిన తప్పేంటి..?
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 10 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అరంగ్రేట ఆటగాడు సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. కాగా.. మొదటి వన్డేలో విఫలమైన రుతురాజ్ పై నెటింట ట్రోల్ మొదలయ్యాయి. బస్సు ఎక్కేందుకు రుతురాజ్ లేటుగా రాగా బస్సు డ్రైవర్ డోర్ మూసేశాడు. దీన్ని తొలి వన్డే వైఫల్యంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నారు.
ఏం జరిగిందంటే..?
మొదటి వన్డేలో ఆడేందుకు టీమ్ఇండియా పేయర్లు హోటల్ నుంచి బయటకు వచ్చారు. భారత జట్టు కోసం ఏర్పాటు చేసిన బస్సులో ప్లేయర్లు అందరూ ఎక్కి కూర్చుకున్నారు. అయితే.. రుతురాజ్ మాత్రం ఫోన్‌లో మాట్లాడుకుంటూ కాస్త ఆలస్యంగా బస్సు వద్దకు చేరుకున్నాడు. సరిగ్గా అతడు బస్సు ఎక్కే సమయంలోనే డోర్ క్లోజ్ అయ్యింది. అందరూ ఎక్కారని బస్సు డ్రైవర్ డోర్ క్లోజ్ చేశాడు. మ్యాచ్‌లో రుతురాజ్ విఫలం అవుతాడు అని తెలిసే బస్సు డ్రైవర్ ఇలా చేశాడని తొలి వన్డేలో వైఫల్యంపై నెటిజన్లు ఈ వీడియోతో ట్రోల్ చేస్తున్నారు.
Bus Driver after Ruturaj Gaikwad scores 5(10).pic.twitter.com/fplUBMOEdc
— Arun Singh (@ArunTuThikHoGya) December 17, 2023
Meme got real ??
Bus driver mistakenly closes the door when Ruturaj Gaikwad was about to enter. ? pic.twitter.com/y2KFfGtScb— All About Cricket (@allaboutcric_) December 17, 2023