Sunrisers Eastern Cape : వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా సన్‌రైజర్స్.. గ్రౌండ్‌లో గంతులేసిన కావ్య పాప.. వీడియోలు వైరల్

దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లోనూ కావ్య సందడి చేసింది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు యాజమాని అయిన కావ్య మారన్.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి మైదానంలో తెగ సందడి చేసేసింది.

Sunrisers Eastern Cape : వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా సన్‌రైజర్స్.. గ్రౌండ్‌లో గంతులేసిన కావ్య పాప.. వీడియోలు వైరల్

Kavya Maran

Updated On : February 11, 2024 / 8:21 AM IST

SA20 Champion: దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ 2024 సీజన్ లో ఛాంపియన్ గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు నిలిచింది. శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ జట్టు 89 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జెయింట్ ను ఓడించింది. తద్వారా దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ ట్రోపీని వరుసగా రెండోసారి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణిత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్ కేవలం 115 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫలితంగా 89 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజయం సాధించింది. మార్క్రామ్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు 2023లో, 2024లో వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది.

Also Read : Shamar Joseph : వెస్టిండీస్ న‌యా సంచ‌ల‌నానికి బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. ఐపీఎల్‌లో ఎంట్రీ.. రూ.3కోట్ల‌కు డీల్‌

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు విజయంతో జట్టు ప్లేయర్స్ తోపాటు, కావ్య మారన్ సంబరాలు అంబరాన్నంటాయి. ఐపీఎల్ టోర్నీలో సన్ రైజర్స్ జట్టు మ్యాచ్ జరుగుతుంటే టీవీ కెమెరా కళ్లతోపాటు క్రికెట్ ఫ్యాన్స్ కళ్లన్నీ కావ్య పైనే ఉంటాయి. అంతలా తమ జట్టు ప్లేయర్స్ ను మైదానంలో ఉండి కావ్య ప్రోత్సహిస్తుంది. తాజాగా దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లోనూ కావ్య సందడి చేసింది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు యాజమాని అయిన కావ్య మారన్.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి మైదానంలో తెగ సందడి చేసేసింది. గెలిచిన తరువాత కప్ అందుకున్న టీం సభ్యులతో గెంతులేసింది.

 

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కావ్య పాప సందడిని చూసిన నెటిన్లు కావ్య ఎక్కడున్నా అందరిచూపు ఆమెపైనే.. కావ్య పాప సూపర్ అంటూ కామెంట్లతో పొగిడేస్తున్నారు.

Also Read : Under-19 World Cup : అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్‌లో టీమ్ఇండియా ట్రాక్ రికార్డు ఇదే..

https://twitter.com/srhfansofficial/status/1756408943138496929?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Etweet

 

https://twitter.com/mufaddal_vohra/status/1756373870624604591

 

https://twitter.com/mufaddal_vohra/status/1756345583198146770

 

https://twitter.com/mufaddal_vohra/status/1756506287570043222

 

https://twitter.com/mufaddal_vohra/status/1756491772707098733