సింధు ఓటమి : హోరాహోరీ పోరులో సైనా విజయం

సింధు ఓటమి : హోరాహోరీ పోరులో సైనా విజయం

సింధు మళ్లీ పాతదారే పట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో వైఫల్యం అలవాటుగా మారిన సింధు మరో సారి సైనా నెహ్వాల్‌తో పోటీకి చేతులెత్తేసింది. సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో సింధూను వరుసగా 21-18, 21-15 పాయింట్లతో చిత్తు చేసి టైటిల్ గెలుచుకుంది. ఆరంభం నుంచి ఆధిక్యం ప్రదర్శించిన సైనా చివరి వరకూ అదే దూకుడు ప్రదర్శించింది. అందరూ ఊహించినట్టే 83వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సైనా ఎగరేసుకుపోయింది. 

గతేడాది జరిగిన ఫైనల్లోనూ సింధును ఓడించిన సైనా చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 2006, 2007లలో కూడా సైనానే ఈ టైటిల్‌ విజేతగా నిలవడం విశేషం. కాగా, పీవీ సింధు మాత్రం 2011, 2013లలో జాతీయ చాంపియన్‌గా నిలవడం గమనార్హం.