జడేజాకు అరటిపండు తొక్క తీసిచ్చిన సైనీ..వీడియో వైరల్

జడేజాకు అరటిపండు తొక్క తీసిచ్చిన సైనీ..వీడియో వైరల్

Updated On : January 11, 2021 / 8:00 PM IST

Saini peeling the banana : క్రికెట్ ఆడుతున్న సమయంలో కొన్ని సరదా సరదా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మైదానంలోకి అభిమానులు అడుగు పెట్టడం, క్రికెటర్లతో సెల్ఫీ దిగడం, క్రికెటర్లు డ్యాన్స్ లు చేయడం, ఇతరత్రా అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా..టీమిండియా క్రికెటర్లకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే.

మూడో టెస్టును టీమ్ ఇండియా డ్రాగా ముగించింది. ఐదో రోజు ఆట కొనసాగుతోంది. హనుమ విహారి, రవి చంద్రన్ అశ్విన్ లు గోడగా నిలబడ్డారు. వీరిద్దరూ అవుట్ కాకుండా..ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి ఓటమి నుంచి జట్టును కాపాడారు.  అయితే..ఎవరైనా అవుట్ అయితే..బ్యాటింగ్ కు వచ్చేందుకు మరొకరు సిద్ధంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇలాగే..స్టాండ్ లో రవేంద్ర జడేజా సిద్ధంగా ఉన్నాడు. కాళ్లకు ప్యాడ్, ఓ చేతికి గ్లౌజ్ వేసుకుని రెడీగా ఉన్నాడు.

ఇతని పక్కన నవదీప్ సైనీ పక్కన కూర్చొన్నాడు. ఈ సమయంలో…అరటి పండ్ల ట్రేతో ఓ వ్యక్తి వచ్చాడు. జడేజా ఓ అరటి పండును తీసుకుని సైనీకి ఇచ్చాడు. నోట్లో ఉన్నది పడేయడానికని లేచి వెనక్కి వెళ్లాడు జడేజా. తిరిగి వచ్చే సరికి సైనీ..అరటి పండు తొక్క తీయసాగాడు. రాగానే..అరటిపండు ఇవ్వడంతో..జడేజా తిన్నాడు. @7Cricket ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. క్షణాల్లో ట్వీట్ వైరల్ అయ్యింది.