Sanju Samson : ఇలాగైతే ఎలా..? ఏం మాత్రం మార‌ని సంజూ శాంస‌న్‌!

సంజూ శాంస‌న్‌కు అనాయ్యం జ‌రుగుతోంది అని అత‌డి అభిమానులు సోష‌ల్ మీడియాలో గ‌గ్గోలు పెడుతుంటారు.

Sanju Samson disappoints on Duleep Trophy debut

Sanju Samson : సంజూ శాంస‌న్‌కు అనాయ్యం జ‌రుగుతోంది అని అత‌డి అభిమానులు సోష‌ల్ మీడియాలో గ‌గ్గోలు పెడుతుంటారు. ఇక అత‌డేమో రాక రాక వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌లం అవుతూ ఉంటాడు. ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అన్న‌ట్లుగా సాగుతోంది అత‌డి కెరీర్‌ను గ‌మ‌నిస్తే. చాన్నాళ్ల త‌రువాత రెడ్ బాల్ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన శాంస‌న్.. 5 ప‌రుగులు చేసి ఓ చెత్త షాట్ ఆడి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌లో భాగంగా ఇండియా-ఏతో ఇండియా-డి పోటీప‌డుతోంది. ఈ మ్యాచ్‌లో ఇండియా-డి త‌రుపున బ‌రిలోకి దిగాడు సంజూ శాంస‌న్. 44 ప‌రుగులకే మూడు కీల‌క వికెట్లు కోల్పోయి జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు క్రీజులోకి అడుగుపెట్టాడు. ఇలాంటి స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన అత‌డు కుదురుకుని భారీ ఇన్నింగ్స్ ఆడి సెల‌క్ట‌ర్ల దృష్టిలో ప‌డి టీమ్ఇండియా టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవాల్సి పోయి.. పేల‌వ షాట్‌తో వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు.

Somerset vs Surrey : మూడు నిమిషాలే ఉన్నాయ్‌.. ఒక్క వికెట్ కావాలి.. అద్భుత దృశ్యం ఆవిష్కృతం

అకిబ్ ఖాన్ వేసిన షాట్ పిచ్ డెలివ‌రీని పుల్ షాట్ ఆడేందుకు య‌త్నించి మిడాన్‌లో ప్రసిద్ కృష్ణచేతికి చిక్కాడు. త‌క్కువ ప‌రుగులే చేసి జ‌ట్టు క‌ష్టాల‌ను రెట్టింపు చేశాడు. ఇక‌ సంజూ ఔట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారగా అత‌డిపై ట్రోల్స్ మొద‌లు అయ్యాయి.

29 ఏళ్ల శాంస‌న్ 2015లో టీమ్ఇండియాలో అరంగ్రేటం చేశాడు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 16 వ‌న్డేలు, 30 టీ20లు మాత్ర‌మే ఆడాడు.

AFG vs NZ : అఫ్గానిస్థాన్‌-న్యూజిలాండ్ ఏకైక టెస్టు ర‌ద్దు.. 91 ఏళ్ల త‌రువాత భార‌త్‌లో మొద‌టి సారి ఇలా..