Somerset vs Surrey : మూడు నిమిషాలే ఉన్నాయ్.. ఒక్క వికెట్ కావాలి.. అద్భుత దృశ్యం ఆవిష్కృతం
బ్యాటింగ్ టీమ్ అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయింది.

Three Minutes To Go one Wicket Left This Happened In Somerset vs Surrey Match
Somerset vs Surrey : బ్యాటింగ్ టీమ్ అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. మ్యాచ్‌లో ఓడిపోకుండా డ్రాతో బయట పడాలంటే మరో మూడు నిమిషాల పాటు ఆఖరి బ్యాటర్లు క్రీజులో నిలిస్తే చాలు. బౌలింగ్ టీమ్‌కు ఒక్క వికెట్ కావాలి. విజయం కోసం ఇరు జట్లు చివరి వరకు పోరాడాయి. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. సోమర్‌సెట్ వర్సెస్ సర్రే జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది.
ఈ మ్యాచ్‌లో సోమర్ సెట్ తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 317 పరుగులు చేసింది. అనంతరం సర్రే తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేసింది. దీంతో సర్రేకు నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం సోమర్‌సెట్ రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. దీంతో సర్రే ముందు 221 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సర్రే మ్యాచ్ చివరి రోజు ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా 109/9 స్కోరు వద్ద నిలిచింది.
సూపర్ ఫ్లాన్..
వికెట్ తీసి గెలవాలని భావించిన సోమర్ సెట్ అద్భుత ప్లాన్ వేసింది. వికెట్ కీపర్, బౌలర్ కాకుండా మిగిలిన 9 మంది ఆటగాళ్లు కూడా బ్యాటర్ పక్కనే ఫీల్డింగ్ సెట్ చేసింది. లీచ్ వేసిన బంతిని బ్యాటర్ వార్రల్ అడ్డుకునేందుకు విఫలయత్నం చేశాడు. బాల్ బ్యాట్‌ను తాకకుండా ప్యాడ్లను తాకింది. ఎల్బీడబ్ల్యూ కోసం సోమర్ సెట్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ వేలు ఎత్తడం క్షణాల్లో జరిగింది. దీంతో సర్రే 109 పరుగులకు ఆలౌల్ కావడంతో సోమర్ సెట్ 111 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
కాగా.. సోమర్‌సెట్‌కు చెందిన 11 మంది ఆటగాళ్లు, సర్రేకు చెందిన ఇద్దరు బ్యాటర్లు మొత్తం 13 మంది ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Virat Kohli : కోహ్లీ వచ్చేశాడు.. లండన్ నుంచి చెన్నైకి చేరుకున్న విరాట్.. రోహిత్ శర్మ సైతం..
❤️ Cricket ❤️#SOMvSUR#WeAreSomerset pic.twitter.com/S7IrAEMezz
— Somerset Cricket (@SomersetCCC) September 12, 2024