Shreyas Iyer : సన్‌గ్లాసెస్‌తో హీరోలా ఎంట్రీ.. డ‌కౌట్‌తో జీరోగా మారిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ఇవే త‌గ్గించుకుంటే మంచిది!

టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇంగ్లాండ్‌తో సిరీస్ మ‌ధ్య‌లో టెస్టు జ‌ట్టులో చోటు కోల్పోయాడు.

Shreyas Iyer : సన్‌గ్లాసెస్‌తో హీరోలా ఎంట్రీ.. డ‌కౌట్‌తో జీరోగా మారిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ఇవే త‌గ్గించుకుంటే మంచిది!

Fans Trolled Shreyas Iyer For Wearing Sunglasses While Batting

Updated On : September 13, 2024 / 12:19 PM IST

Shreyas Iyer : టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇంగ్లాండ్‌తో సిరీస్ మ‌ధ్య‌లో టెస్టు జ‌ట్టులో చోటు కోల్పోయాడు. ఆ త‌రువాత సెంట్ర‌ల్ కాంట్రాక్టును కోల్పోయాడు. ప్ర‌స్తుతం టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో దేశ‌వాళీ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణించ‌డంలో విఫ‌లం అవుతున్నాడు. దులీఫ్ ట్రోఫీ రెండో రౌండ్‌లో భాగంగా ఇండియా-ఏతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు.

ఈ మ్యాచ్‌లో ఏడు బంతుల‌ను ఎదుర్కొన్న అయ్య‌ర్ ప‌రుగుల ఖాతా తెర‌వ‌క‌ముందే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఖ‌లీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో షాట్‌కు య‌త్నించాడు. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అకీబ్ చేతికి చిక్కాడు. ఈ క్ర‌మంలో ఇండియా-డికి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

Virat Kohli : కోహ్లీ వ‌చ్చేశాడు.. లండ‌న్ నుంచి చెన్నైకి చేరుకున్న విరాట్‌.. రోహిత్ శ‌ర్మ సైతం..

అనంత‌పురంలో మ్యాచ్ జ‌రుగుతోంది. ఎండ కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో అయ్య‌ర్ స‌న్‌గ్లాసెస్ పెట్టుకుని బ్యాటింగ్ వ‌చ్చాడు. ఏడు బంతులు ఎదుర్కొని డ‌కౌట్ అయ్యాడు. సాధారణంగా బ్యాటర్లు ‌సన్‌గ్లాసెస్ ధరించి బ్యాటింగ్‌ చేయడం చాలా అరుదు. శ్రేయస్ ఇలా రావడం, విఫ‌లం కావ‌డంతో నెట్టింట అత‌డి ఫొటోలు వైరల్‌గా మారాయి. స‌న్‌గ్లాసెస్‌తో హీరోలా వ‌చ్చి జీరోకి ఔటయ్యాడు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఇండియా-ఏ మొద‌టి ఇన్నింగ్స్‌లో 290 ప‌రుగులు చేసింది. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా-డి రెండో రోజు లంచ్ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 86 ప‌రుగులు చేసింది. రికీ భుయ్ (22), దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (40) లు క్రీజులో ఉన్నారు.

Hardik Pandya : హార్దిక్ వీడియో వెనుక అర్థం ఏమిటి? గంభీర్ మాస్ట‌ర్ ప్లాన్‌?