ఇక నిద్రపో: కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను తప్పించిన పాక్ జట్టు

వరల్డ్ కప్ ఘోర వైఫల్యం తర్వాత పాక్ జట్టులో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కీలకంగా సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు వచ్చే ఏడాది జులై వరకూ వన్డే మ్యాచ్‌లు ఆడేది లేదని సంచలనం సృష్టించింది. టెస్టు మ్యాచ్‌లకు అజహర్ అలీ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, టీ20 కెప్టెన్‌గా బాబార్ అజామ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.
టీ20 కెప్టెన్‌గా సర్ఫరాజ్ అహ్మద్ సృష్టించిన రికార్డులు కొనసాగిస్తానని కొత్త కెప్టెన్ బాబర్ అజామ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. పాక్ టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన అజహర్ అలీ ‘జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఎంపికవడం కంటే గౌరవం ఇంకొకటి లేదు’ అని సంతోషాన్ని వ్యక్తపరిచాడు.
ఇక కెప్టెన్సీ హోదా నుంచి తప్పుకుంటున్న సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ‘పాక్ జట్టును ఉన్నత స్థాయికి చేర్చినందుకు గొప్పగా భావిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో సహచరులకీ, కోచ్‌లు, సెలక్టర్లకు థ్యాంక్స్ చెబుతున్నాను. అజహర్ అలీ, బాబర్ అజామ్ లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్లు జట్టును ఇంకా దృఢంగా మారుస్తారని ఆశిస్తున్నాను’ అని సర్ఫరాజ్ తెలిపాడు.