ICC World Cup 2023: వెస్టిండీస్‌కు ఘోర పరాభవం.. స్కాట్లాండ్ చేతిలో ఓటమి.. ఇక వన్డే ప్రపంచ కప్-2023 నుంచి..

ఇవాళ జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ సూపర్ సిక్స్ మ్యాచులో స్కాట్లాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

ICC World Cup 2023: వెస్టిండీస్‌కు ఘోర పరాభవం.. స్కాట్లాండ్ చేతిలో ఓటమి.. ఇక వన్డే ప్రపంచ కప్-2023 నుంచి..

Scotland beat West Indies (@ICC)

Updated On : July 1, 2023 / 8:06 PM IST

ICC World Cup 2023 – West Indies -: వెస్టిండీస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. స్కాట్లాండ్ (Scotland) చేతిలో ఓటమి పాలై వన్డే ప్రపంచ కప్-2023కు అర్హత సాధించలేకపోయింది. వెస్టిండీస్ రెండు సార్లు ప్రపంచ కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అటువంటి జట్టు ఇప్పుడు పసికూన స్కాట్లాండ్ చేతిలో ఓడడం, కనీసం వన్డే ప్రపంచ కప్ కు అర్హత సాధించకపోవడం గమనార్హం.

ఇవాళ జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ సూపర్ సిక్స్ మ్యాచులో స్కాట్లాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 భారత్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐసీసీ (ICC) షెడ్యూల్‌ ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది.

ప్రపంచ కప్ అర్హత కోసం ప్రస్తుతం సూపర్ సిక్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో శ్రీలంక, జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, వెస్టిండీస్, ఒమన్ ఉన్నాయి. వెస్టిండీస్, ఒమన్ కు ఒక్క పాయింటూ లేదు. దీంతో ఆ రెండు జట్లూ అర్హత సాధించలేదు.

సూపర్ సిక్స్ పాయింట్ల టేబుల్..

ఇప్పటికే అర్హత సాధించిన జట్లు..
భారత్
అఫ్గానిస్థాన్
ఆస్ట్రేలియా
బంగ్లాదేశ్
ఇంగ్లండ్
న్యూజిలాండ్
పాకిస్థాన్
దక్షిణాఫ్రికా

ICC World Cup 2023: ఇండియాకు త్వరలో పాకిస్థాన్ భద్రతా ప్రతినిధి బృందం.. పాక్ జట్టు మ్యాచ్‌లు ఆడే మైదానాల సందర్శన