రెండో టీ20కు తుఫాన్ దెబ్బ

భారత్-బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న రెండో టీ20కు తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. గుజరాత్ లోని రాజ్ కోట్ వేదికగా నవంబరు 7న రెండో టీ20 ఆడనున్నాయి ఇరు జట్లు. అదే సమయానికి మహా తుఫాన్ తీరం ధాటి పెను తుఫాన్ గా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
గడిచిన ఆరు గంటల్లో పశ్చిమ మధ్య అరేభియా సముద్రం దాటి వాయువ్య దిశగా పది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తూర్పు మధ్య అరేబియా సముద్రానికి ఆనుకొని పశ్చిమ నైరుతి దిశగా కేంద్రీకృతమైంది.ఇంకా గుజరాత్ తీరాన్ని డయ్యూతో పాటు పోర్ బందర్ మీదుగా దాటనుంది. నవంబరు 7నాటికి గంటకు 8వేల 90కిలోమీటర్ల నుంచి 100కిలోమీటర్ల వరకూ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అదే రోజున గుజరాత్ లోని సౌరాష్ట్ర స్టేడియం వేదికగా టీమిండియా, బంగ్లాదేశ్ లు రెండో టీ20ఆడనున్నాయి. ఇప్పటికే తొలి టీ20లో విజయాన్ని దక్కించుకుని 1-0ఆధిక్యంతో ఉన్న బంగ్లా.. ఈ మ్యాచ్ కూడా రద్దు అయితే విజయానికి చేరువ అవుతుంది. అప్పుడు భారత్ చివరి మ్యాచ్ గెలిస్తే డ్రా.. లేదంటే సిరీస్ బంగ్లాకు కైవసం అవుతుంది.