Serena Williams: శుభవార్త చెప్పిన సెరెనా విలియమ్స్.. రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్‌తో
అమెరికా టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ మరోసారి తల్లికాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. మెట్ గాలా 2023 ఈవెంట్‌కు హాజరవుతున్నప్పుడు తన కూతురు కోరుకున్నట్లుగా ఆమెకు తోబుట్టువును బహుమతిగా ఇవ్వబోతున్నామని చెప్పింది.

Serena Williams announces pregnancy
Serena Williams: అమెరికా టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్(Serena Williams) మరోసారి తల్లికాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. మెట్ గాలా 2023 ఈవెంట్‌కు హాజరవుతున్నప్పుడు తన కూతురు కోరుకున్నట్లుగా ఆమెకు తోబుట్టువును బహుమతిగా ఇవ్వబోతున్నామని చెప్పింది. అంతేకాకుండా ఈ సంతోషకరమైన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
“అన్నా వింటౌర్ మా ముగ్గురిని మెట్ గాలాకు ఆహ్వానించినందుకు చాలా సంతోషిస్తున్నాము.” అంటూ తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని హింట్ ఇస్తూ బేజీ బంప్‌తో భర్తతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. మరో ఫోటోలో ఆమె తన బేబీ బంప్‌ను పట్టుకుని కనిపిస్తోంది. ఈ ఫోటోల్లో సెరెనా విలియమ్స్ నల్లటి గౌన్‌కు తెలుపు రంగు స్కర్ట్ వేసుకుని ముత్యా హారం ధరించి మెరిసిపోతుండగా, ఆమె భర్త నలుపు రంగు సూట్ ధరించి ఆమెను మ్యాచ్ చేశాడు. ప్రతిష్టాత్మక మెట్ గాలా ఈవెంట్‌లో రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్ ప్రద్శరిస్తూ సెరెనా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
View this post on Instagram
సెరెనా విలియమ్స్ 1995లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు 23 సింగిల్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకుంది. రెడ్డిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌ను 2017లో పెళ్లి చేసుకుంది. 2017 సెప్టెంబర్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు అలెక్సిస్ ఒలింపియా ఒహానియన్ అని నామకరణం చేశారు. 2022 ఆగస్టు 9న టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సెరెనా ప్రకటించింది. అయితే.. తాను టెన్నిస్‌కు వీడ్కోలు పలకడం లేదని ఓ సారి చెప్పింది. కానీ ఇంత వరకు మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టలేదు.