India U-19 players : భారత యువజట్టుకు ఘోర అవమానం.. కరీబియన్‌కు నో ఎంట్రీ..!

అండర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ 2022 గెలిచిన భార‌త యువ జ‌ట్టుకు ఘోర అవమానం జరిగింది. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదనే కారణంతో వారిని కరేబియన్ గడ్డపై అడుగుపెట్టనివ్వలేదు.

India U-19 players : భారత యువజట్టుకు ఘోర అవమానం.. కరీబియన్‌కు నో ఎంట్రీ..!

Seven Unvaccinated India U 19 Players Were Denied Entry Into Caribbean And Told To Go Back

Updated On : February 22, 2022 / 9:46 PM IST

India U-19 players : అండర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ 2022 గెలిచిన భార‌త యువ జ‌ట్టుకు ఘోర అవమానం జరిగింది. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదనే కారణంతో వారిని కరేబియన్ గడ్డపై అడుగుపెట్టనివ్వలేదు. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకపోవడంతో ఏడుగురు భార‌త క్రికెటర్ల‌ను పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్ పోర్టు అధికారులు నిలిపివేశారు. ఒకరోజుంతా వారిని తమ అధీనంలోనే ఉంచుకున్నారని జ‌ట్టు మేనేజ‌ర్ లోబ్జాంగ్ జీ టెన్జింగ్ వెల్ల‌డించాడు. జట్టులోని ఏడుగురిలో ర‌వికుమార్‌, ర‌ఘువంశీని తిరిగి భార‌త్‌కు వెళ్లిపోవాలని ఇమిగ్రేష‌న్ అధికారులు హెచ్చరించార‌ు.

Seven Unvaccinated India U 19 Players Were Denied Entry Into Caribbean And Told To Go Back (1)

Seven Unvaccinated India U 19 Players Were Denied Entry Into Caribbean And Told To Go Back 

భార‌త ప్రభుత్వ అనుమతి వచ్చేవరకూ వారిని క‌రీబియ‌న్ గ‌డ్డ‌పై అడుగుపెట్టనిచ్చేది లేదని అన్నారు. భార‌త్‌లో టీనేజీ కుర్రాళ్లకి వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ‌ ఇంకా ప్రారంభించలేదని వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఆటగాళ్లను ఇమిగ్రేషన్ అధికారులకు అనుమతించలేదని చెప్పారు. ఆ ఏడుగురిని త‌ర్వాతి ఫ్లయిట్‌లో ఇండియాకి తిరిగి పంపిచేస్తామంటూ బెదిరించారని టెన్జింగ్ పేర్కొన్నాడు. 24 గంట‌ల త‌ర్వాత‌ ఐసీసీ, బీసీసీఐ జోక్యం చేసుకోవడంతో ఆట‌గాళ్లు మ్యాచ్ వేదిక నుంచి గ‌యానాకు చేరుకున్నార‌ని తెలిపాడు.

Read Also :  Cricket Canada : 9మంది క్రికెటర్లకు కరోనా.. ప్లేయర్లు లేక వరల్డ్‌కప్ నుంచి వైదొలిగిన జట్టు