Cricket Canada : 9మంది క్రికెటర్లకు కరోనా.. ప్లేయర్లు లేక వరల్డ్‌కప్ నుంచి వైదొలిగిన జట్టు

జట్టులో 9మంది ప్లేయర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో 11మంది ఆటగాళ్లను బరిలోకి దించలేక టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.

Cricket Canada : 9మంది క్రికెటర్లకు కరోనా.. ప్లేయర్లు లేక వరల్డ్‌కప్ నుంచి వైదొలిగిన జట్టు

Cricket Canada

Cricket Canada : ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా కెనడా జట్టులో 9మంది ప్లేయర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో 11మంది ఆటగాళ్లను బరిలోకి దించలేక టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు క్రికెట్ కెనడా ప్రకటించింది. స్కాట్లాండ్ తో జరగాల్సిన మ్యాచ్ ని రద్దు చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది. కాగా, భారత జట్టులోనూ ఆరుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

Reliance Jio 5G speed: ఒక్క నిమిషంలో రెండు గంటల సినిమా డౌన్‌లోడ్ చేయవచ్చు

కరోనా కేసుల కారణంగా టోర్నీ మధ్యలోనే కెనడా జట్టు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ జట్టులో 15 మందిలో 9 మంది ప్లేయర్లు కరోనా బారిన పడడంతో మ్యాచ్ ఆడేందుకు కావాల్సిన ప్లేయర్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి కెనడాది. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టోర్నీ నుంచి తప్పుకుని, స్వదేశానికి వెళ్తున్నట్టు కెనడా జట్టు ప్రకటించింది.

‘అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ నుంచి ఇలా అర్ధాంతరంగా తప్పుకోవాల్సి రావడం నిజంగా దురదృష్టకరమైన విషయం. అయితే కుర్రాళ్ల కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని, వారికి మెరుగైన భద్రత, వైద్య సదుపాయాలు కల్పించేందుకే స్వదేశానికి తీసుకెళ్తాం… ఐసోలేషన్‌ లో గడిపి, పూర్తిగా కోలుకున్న తర్వాత ప్లేయర్లను ఇంటికి పంపిస్తాం…’ అని కెనడా క్రికెట్ (సీసీ) ప్రెసిడెంట్ రాష్‌పాల్ భజ్వా తెలిపారు. ప్లేయర్లతో పాటు కెనడా టీమ్ మేనేజర్, మిగిలిన సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డట్టు సమాచారం. ప్రస్తుతం ట్రినిడాడ్‌లో ఓ హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్న కెనడా జట్టు, ప్రత్యేక ఫ్లైట్‌లో స్వదేశానికి పయనం కానుంది.

Drink Alcohol : రోజు మద్యం తాగుతున్నారా…అయితే బరువు పెరుగుతున్నట్టే…

టీమిండియా కెప్టెన్ యష్ ధుల్‌తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్, మరో నలుగురు ప్లేయర్లు కరోనా బారిన పడ్డారు. అయితే భారత బృందంపై ఆ ప్రభావం పెద్దగా పడలేదు. కెప్టెన్, వైస్ కెప్టెన్ లేకుండానే ఉగాండా, ఐర్లాండ్‌లపై భారత జట్టు భారీ విజయాలు నమోదు చేసింది.