Shadab Khan : రోహిత్ శ‌ర్మ ఇష్ట‌మైన ఆట‌గాడు.. ఇలాగే తింటే లావైపోతాం..

పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు ఇప్ప‌టికే హైద‌రాబాద్ చేరుకుంది. ఉప్పల్ వేదిక‌గా పాక్ రెండు వార్మ‌ప్ మ్యాచుల‌తో పాటు మ‌రో రెండు ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది.

Shadab Khan : రోహిత్ శ‌ర్మ ఇష్ట‌మైన ఆట‌గాడు.. ఇలాగే తింటే లావైపోతాం..

Shadab Khan-Rohit Sharma

Shadab Khan-Rohit Sharma : అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు ఇప్ప‌టికే హైద‌రాబాద్ చేరుకుంది. ఉప్పల్ వేదిక‌గా పాక్ రెండు వార్మ‌ప్ మ్యాచుల‌తో పాటు మ‌రో రెండు ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. ఇప్ప‌టికే న్యూజిలాండ్‌తో జ‌రిగిన మొద‌టి వార్మ‌ప్ గేమ్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది. అక్టోబ‌ర్ 3న ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న వార్మ‌ప్ మ్యాచ్ కోసం సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ మీడియాతో మాట్లాడాడు.

హైదరాబాద్ గురించి..

ఇక్క‌డి వాతావ‌ర‌ణం, ప్లేయింగ్ కండిష‌న్స్ అన్నీ పాకిస్తాన్‌లో ఉన్న‌ట్లుగానే ఉన్నాయ‌న్నాడు. మొద‌టి వార్మ‌ప్ మ్యాచ్ కోసం ఉప‌యోగించిన పిచ్ పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉండే పిచ్‌లాగానే చాలా ప్లాట్‌గా ఉంద‌ని, బౌండ‌రీలు కూడా చిన్న‌విగా ఉన్నాయ‌ని చెప్పాడు. న్యూజిలాండ్‌తో వార్మ‌ప్ మ్యాచ్‌లో బౌల‌ర్లు అంత‌గా రాణించ‌లేక‌పోయార‌న్నాడు. త‌మ బౌలింగ్ ఇంకా మెరుగుప‌డాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. రాబోయే రోజుల్లో బౌల‌ర్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తార‌ని న‌మ్ముతున్న‌ట్లు చెప్పాడు.

ఇక్కడి ఆతిథ్యం త‌న‌కు బాగా నచ్చిందన్నాడు. ఫుడ్ చాలా రుచికరంగా ఉందన్నాడు. ఇలాగే తింటే లావైపోతామ‌న్నాడు. ఇలాంటి ఆతిథ్యమే అహ్మదాబాద్ లోనూ ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

Ashwin : చెన్నైలో అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ మాస్ట‌ర్ ప్లాన్‌..!

రోహిత్ శ‌ర్మ ఇష్ట‌మైన ప్లేయ‌ర్‌..

భార‌త జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌న్నాడు. అత‌డు ఫామ్‌లో ఉన్నాడంటే అడ్డుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని చెప్పాడు. ఇక బౌలింగ్‌లో కుల్దీప్ యాద‌వ్ మంచి ఫామ్‌లో ఉన్నాడ‌ని, గ‌త కొంత‌కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడ‌ని ప్ర‌శంసించాడు. కుల్దీప్ అంటే త‌న‌కు ఇష్ట‌మేన‌ని, ఎందుకంటే తాను కూడా ఓ లెగ్ స్పిన్న‌ర్‌నే అని చెప్పుకొచ్చాడు.

కాగా.. న్యూజిలాండ్‌తో జ‌రిగిన వార్మ‌ప్ మ్యాచులో షాదాబ్ ఖాన్ బౌలింగ్ చేయ‌లేదు. బ్యాటింగ్‌లో 11 బంతుల్లో 2 సిక్స‌ర్ల‌లో 16 ప‌రుగులు చేశాడు.