Shaheen Afridi does cradle celebration to welcome newborn baby
PAK vs BAN : పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది ప్రత్యేక ఆకర్షణ నిలిచాడు. సాధారణంగా షాహీన్ అఫ్రిది వికెట్ తీసిన అనంతరం తన రెండు చేతులను పైకెత్తి సిగ్నేచర్ స్టయిల్‌లో సంబురాలు చేసుకోవడాన్ని చూశాం. అయితే.. ఈ మ్యాచ్‌లో మాత్రం అతడు కాస్త వెరైటీగా సెలబ్రెషన్స్ చేసుకున్నాడు.
బంగ్లా బ్యాటర్ హసన్ మహమూద్ వికెట్ తీసిన తరువాత ఈ పేసర్.. చిన్నారిని ఒడిలో ఆడిస్తున్నట్లు సెలబ్రెషన్స్ చేసుకున్నాడు. అయితే.. అతడు ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఓ కారణం ఉంది. ఇటీవలే అతడు తండ్రి అయ్యాడు. కొడుకు పుట్టిన ఆనందంలో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు అఫ్రిదికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Nicholas Pooran : టీ20ల్లో పూరన్ విధ్వంసం.. సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల రికార్డు బద్దలు..
పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కూతురు అన్ష ను షాహీన్ వివాహం చేసుకున్నాడు. ఇటీవల అన్ష అఫ్రిది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు అలి యార్ అని పేరు పెట్టారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో 448/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ముష్పికర్ రహీమ్ (191) భారీ శతకం బాదడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌ల్లో 565 పరుగులకు ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్‌కు 117 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాకిస్తాన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. పాకిస్థాన్ ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది.
Rohit Sharma : మరోసారి తండ్రి కాబోతున్న టీమ్ఇండియా కెప్టెన్..? రితికా నిజంగానే ప్రెగ్నెంటా..?
That Celebration ?@iShaheenAfridi’s first wicket after the birth of his son! ?#PAKvBAN | #TestOnHai pic.twitter.com/3x0jwtOHw3
— Pakistan Cricket (@TheRealPCB) August 24, 2024