ఆస్ట్రేలియా బౌలర్ షేన్ వార్న్ పై ఏడాది పాటు నిషేధం

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ పై ఏడాది పాటు డ్రైవింగ్ నిషేధం విధించింది లండన్ కోర్టు. రెండేళ్లలో ఆరోసారి పరిమితికి మించి వేగంగా వాహనం నడిపినందుకు వింబుల్డన్ మేజిస్ట్రేట్ కోర్టు అతడికి ఈ మేరకు శిక్ష విధించింది కోర్టు. అంతేకాదు 1,485 పౌండ్లు(రూ. 1.62 లక్షల) జరిమానా విధించాలని ఆదేశించింది కోర్టు.
గత సంవత్సరం లండన్ లో 64 కిలో మీటర్లు వేగాన్ని షేన్ వార్న్ అతిక్రమించాడు. అంతేకాకుండా అతడు లైసెన్స్ ఖాతాలో 15 పెనాల్టీ పాయింట్లు ఉన్నాయి. ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు శిక్షను విధించినట్లు న్యాయమూర్తి టర్నర్ వెల్లడించారు.
ప్రజల రక్షణ దృష్టిలో పెట్టుకోని శిక్షను విధించినట్లు జడ్జ్ చెప్పారు. ఆసీస్ తరఫున షేన్ వార్న్ 145 టెస్టులు, 194 వన్డేలు ఆడాడు. టెస్టులో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు తీసిన వార్న్ అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా రికార్డులకు ఎక్కాడు.