ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020వేలంలో అద్భుతాలు జరిగాయి. అనుభవం పక్కుబెట్టి టాలెంట్‌కు ప్రాధాన్యతనిచ్చే ఐపీఎల్ వేలం మరోసారి సత్తా ఉన్న ప్లేయర్లను టాప్‌లో నిలబెట్టింది. అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు కనీస ధర కంటే రెట్టింపు ధరకు కొనుగోలు అవగా వేలానికి విడిచిపెట్టేసిన ప్లేయర్లలో హెట్‌మేయర్ అద్భుతమైన ఘనత సాధించాడు.
ఈ వెస్టిండీస్ ఓపెనర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలానికి వదిలేసింది. 2019లో రూ.4.20కోట్లకు కొనుగోలు చేసి విడిచిపెట్టేసింది. దీంతో కనీస ధర రూ.50లక్షలతో మొదలైన హెట్‌మేయర్ పదిహేనున్నర రెట్లు ఎక్కువగా రూ.7.75కోట్లకు అమ్ముడుపోయాడు. ఈ సంతోషాన్ని క్రేజీ డ్యాన్స్ రూపంలో వ్యక్తం చేశాడు.
వద్దనుకుని వదిలేసిన ఆర్సీబీకి మరో ఎదురుదెబ్బ. హెట్‌మేయర్‌కు జాక్ పాట్ అంటూ నెటిజన్లు కామెంట్లుచేస్తున్నారు. ఐపీఎల్ వేలంలో హెట్‌మేయర్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్‌లలో ఆరో స్థానంలో నిలిచాడు. పాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, నాథన్ కౌల్టర్ నైల్ ఇతని కంటే ముందు వరుసలో ఉన్నారు.
హెట్ మేయర్ కు ఇంత క్రేజ్ రావడానికి కారణం.. వెస్టిండీస్ తోజరిగిన తొలి వన్డేలో 139పరుగులు చేశాడు. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించడం కరేబియన్ జట్టుకు సునాయాసం చేశాడు. వన్డే సిరీస్ ను విజయంతో ఆరంభించిన విండీస్ రెండో వన్డేలో పరాజయాన్ని బదులిచ్చింది భారత్.
Us: Hi, Mr. Shimron. Welcome to DC! Can you please share a message for our fans?
*1 minute later*@SHetmyer:#IPLAuction2020 #IPLAuction #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/NrcjO03sJO
— Delhi Capitals (@DelhiCapitals) December 19, 2019
Delhi Capitals squad: Shikhar Dhawan, Ajinkya Rahane, Prithvi Shaw, Shreyas Iyer, Rishabh Pant (wk), Axar Patel, Harshal Patel, R Ashwin, Amit Mishra, Sandeep Lamichhane, Kagiso Rabada, Ishant Sharma, Keemo Paul, Avesh Khan, Shimron Hetmyer, Marcus Stoinis, Alex Carey, Jason Roy, Chris Woakes, Mohit Sharma, Tushar Deshpande, Lalit Yadav.