Shoaib Akhtar : మరోసారి తండ్రైన షోయబ్ అక్తర్ .. పాపకు జన్మనిచ్చిన భార్య రుబాబ్ ఖాన్

షోయబ్ అక్తర్, రుబాబ్ ఖాన్ 2014లో పెళ్లిచేసుకున్నారు. 2016లో రుబాబ్ ఖాన్ కొడుకు మికైల్ కు జన్మనిచ్చింది. 2019లో రెండోసారి రుబాబ్ ఖాన్ మజీద్ కు జన్మనిచ్చారు.

Shoaib Akhtar : మరోసారి తండ్రైన షోయబ్ అక్తర్ .. పాపకు జన్మనిచ్చిన భార్య రుబాబ్ ఖాన్

Shoaib Akhtar

Rubab Khan : ప్రపంచ క్రికెట్ లో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా గుర్తింపు పొందిన పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మూడోసారి తండ్రి అయ్యాడు. షోయక్ అక్తర్ భార్య రుబాబ్ ఖాన్ పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అక్తర్ తన ట్విటర్ ఖాతాద్వారా వెల్లడించారు. మికైల్, ముజీద్ లకు ఇప్పుడు చెల్లెలు వచ్చింది.. అల్లా మాకు కుమార్తెను అనుగ్రహించాడు.. 1 మార్చి 2024న జన్మించిన నూర్ అలీ అక్తర్‌కు స్వాగతం అంటూ చిన్నారిని ఎత్తుకున్న తన ఫొటోను అక్తర్ షేర్ చేశాడు. దీంతో అక్తర్ కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Yuvraj Singh : గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి యువరాజ్ పోటీ చేస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన మాజీ క్రికెటర్

షోయబ్ అక్తర్, రుబాబ్ ఖాన్ 2014లో పెళ్లిచేసుకున్నారు. 2016లో రుబాబ్ ఖాన్ కొడుకు మికైల్ కు జన్మనిచ్చింది. 2019లో రెండోసారి రుబాబ్ ఖాన్ మజీద్ కు జన్మనిచ్చారు. ఇప్పుడు దంపతులిద్దరూ మూడోసారి తల్లిదండ్రులయ్యారు. 2011 వన్డే ప్రపంచ కప్ తరువాత షోయబ్ అక్తర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.