Izhaan : షోయబ్ 3వ పెళ్లి కారణంగా స్కూల్లో వేధింపులు ఎదుర్కొన్న సానియా కొడుకు ?

తల్లిదండ్రుల విడాకులు, తండ్రి మూడవ పెళ్లి సానియా-షోయబ్‌ల కొడుకు ఇహాన్‌పై ప్రభావం చూపించింది. తను డిస్ట్రబ్ అవ్వడమే కాకుండా స్కూలు నుండి కూడా వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

Izhaan : షోయబ్ 3వ పెళ్లి కారణంగా స్కూల్లో వేధింపులు ఎదుర్కొన్న సానియా కొడుకు ?

Izhaan

Izhaan : సానియా మీర్జా విడాకులు, షోయబ్ మాలిక్ 3వ పెళ్లి వారి మూడేళ్ల కుమారుడు ఇహాన్ మీర్జా మాలిక్ మీద ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇహాన్ తను చదువుకుంటున్న పాఠశాలలో వేధింపులు ఎదుర్కొన్నట్లు సానియాను ఇంటర్వ్యూ చేసిన పాకిస్తానీ జర్నలిస్ట్ నయీమ్ హనీఫ్ వెల్లడించినట్లు సమాచారం.

Shoaib Malik On Third Marriage: సానియా మీర్జాతో విడాకులు, సనా జావేద్ తో వివాహంపై మౌనం వీడిన షోయబ్ మాలిక్

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ రెండు వారాల క్రితం పాకిస్తానీ నటి సనా జావేద్‌ను మూడవ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని షోయబ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరి పెళ్లి వార్త అందర్నీ షాక్‌కి గురి చేసింది. షోయబ్ మొదటి పెళ్లి అయేషా సిద్ధికీతో జరిగింది. వారి విడాకుల తర్వాత 2010 లో సానియా మీర్జాను షోయబ్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరి విడాకుల వార్తను సానియా తండ్రి కన్ఫమ్ చేసారు. కాగా వీరిద్దరి విడాకులు.. షోయబ్ 3వ పెళ్లి వార్తలతో ఇహాన్ తన పాఠశాలలో వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. నయీమ్ హనీఫ్ అనే పాకిస్తానీ జర్నలిస్టు తన కుమారుడి మానసిక ఆరోగ్యంపై సానియా ఆందోళన వ్యక్తం చేసారని.. తన తండ్రి మూడవ పెళ్లి వార్త ఇహాన్‌ను మానసిక క్షోభకు గురి చేసాయని అన్నారు. ఈ నేపథ్యంలో సానియా తన స్వస్థలమైన హైదరాబాద్‌కు తిరిగి వస్తారంటూ వార్తలు వస్తున్నాయి.

Sania Mirza : విడాకుల త‌రువాత సానియా మీర్జా మొద‌టి పోస్ట్‌.. ఏమ‌న్న‌దంటే..?

సానియా-షోయబ్‌లకు ఏప్రిల్ 12, 2010 లో పెళ్లైంది. కెరియర్‌లో బిజీగా ఉన్న ఇద్దరికి వివాహమైన 8 సంవత్సరాల తర్వాత 2018 లో ఇహాన్ జన్మించాడు. ఇహాన్ పుట్టాక సానియా టెన్నిస్‌కు విరామం తీసుకున్నారు. తను రాసుకున్న ఆత్మ కథ ‘Ace Against Odds’ లో తను, షోయబ్ తమ కెరియర్‌లో ఎదుర్కున్న ఇబ్బందులను గురించి సానియా రాసారు.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar)