Shoaib Malik On Third Marriage: సానియా మీర్జాతో విడాకులు, సనా జావేద్ తో వివాహంపై మౌనం వీడిన షోయబ్ మాలిక్

మాలిక్ మూడో పెళ్లిపై కుటుంబ సభ్యులుకూడా సంతోషంగా లేరని సమాచారం. వీరి వివాహానికి కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు. అయితే, అతడి తమ్ముడు

Shoaib Malik On Third Marriage: సానియా మీర్జాతో విడాకులు, సనా జావేద్ తో వివాహంపై మౌనం వీడిన షోయబ్ మాలిక్

shoaib malik

Updated On : January 30, 2024 / 11:08 PM IST

Shoaib Malik and Sania Mirza Divorce : పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ జనవరి 18న పాకిస్థానీ నటి సనా జావేద్ ను మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయిన రెండు రోజుల తరువాత ఈ జంట తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సనాతో పెళ్లి ప్రకటన తర్వాత షోయబ్ తన రెండో భార్య సానియా మీర్జాతో విడాకులు తీసుకున్నటు్ల కూడా స్పష్టమైంది. సనా జావేద్ తో పెళ్లి తరువాత షోయబ్ మాలిక్ తీవ్రస్థాయిలో ట్రోల్ కు గురయ్యాడు. తాజాగా షోయబ్ తన మూడోపెళ్లి విషయంపై మౌనం వీడాడు.

Also Read : Shoaib Malik : షోయ‌బ్ మాలిక్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. కాంట్రాక్ట్ ర‌ద్దు..!

షాడో ప్రొడక్షన్స్ పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడుతున్నప్పుడు షోయబ్ మూడో పెళ్లిపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించారు. మీ హృదయం ఏమి చెబుతుందో మీరు అదే చేయాలి. ప్రజలు ఏమనుకుంటారో, మన చుట్టుప్రక్కల వారు ఏమనుకుంటారో అని ఆలోచించకూడదు. ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోవడానికి మీకు సమయం పట్టినప్పటికీ.. ఒకవేళ మీకు 10ఏళ్లు లేదా 20ఏళ్లు పట్టినా మీకు అనిపించిన దాన్నే చేయండి అంటూ షోయబ్ పేర్కొన్నారు.

Also Read : Shoaib Malik : షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై ఏడాది క్రితమే హింట్ ఇచ్చాడా?

ఇదిలాఉంటే మాలిక్ మూడో పెళ్లిపై కుటుంబ సభ్యులుకూడా సంతోషంగా లేరని సమాచారం. వీరి వివాహానికి కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు. అయితే, అతడి తమ్ముడు పెళ్లికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. షోయబ్ మాలిక్, సానియా మీర్జా 2010 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇజాన్ అనే కుమారుడు ఉన్నాడు.