Shreyas Iyer : జ‌ట్టులోకి నేనొస్తా.. శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్‌

టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్ టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు క‌ష్ట‌ప‌డుతున్నాడు.

Shreyas Iyer wishes for Test return after sublime ton in Ranji Trophy

టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్ టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు క‌ష్ట‌ప‌డుతున్నాడు. పేల‌వ ఫామ్ కార‌ణంగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్ త‌రువాత జ‌ట్టులో చోటు కోల్పోయాడు. అనంత‌రం బీసీసీఐ ఆగ్ర‌హానికి గురై సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. ప్ర‌స్తుతం టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ల‌క్ష్యంగా రంజీట్రోఫీలో ఆడుతున్నాడు. ముంబైకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న శ్రేయ‌స్ భారీ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ క్ర‌మంలో మీడియాతో మాట్లాడుతూ జ‌ట్టులోకి పున‌రాగ‌మ‌నం కోసం ఎదురుచూస్తున్న‌ట్లు చెప్పాడు.

టీమ్ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాను. అయితే.. అది నా చేతుల్లో లేదు అని శ్రేయ‌స్ అన్నాడు. అత్యున్న‌త ఆటతీరును క‌న‌బ‌ర‌చ‌డ‌మే త‌న ముందు ఉన్న ల‌క్ష్యం అని చెప్పాడు. సాధ్య‌మైన‌న్ని ఎక్కువ మ్యాచులు ఆడేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పాడు. త‌న ఫిట్‌నెస్ బాగుంద‌న్నాడు. త‌ప్ప‌కుండా జాతీయ జ‌ట్టులోకి వ‌స్తాన‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు.

IND vs NZ : ఐదో రోజు మైదానంలో క‌నిపించ‌ని రిష‌బ్ పంత్‌.. రెండో టెస్టు ఆడ‌తాడా? లేదా?

చాలా రోజుల త‌రువాత శ‌త‌కం చేయ‌డం త‌న‌కు ఆనందాన్ని ఇచ్చింద‌న్నాడు. గాయాల నుంచి కోలుకుని వ‌చ్చిన త‌రువాత ఇలాంటి ఇన్నింగ్స్ ఆడ‌డం బాగుంద‌న్నాడు. ఇక వ‌రుస‌గా రంజీ ట్రోఫీ, ఐపీఎల్‌, ఇరానీ క‌ప్‌ల‌ను గెలిచిన జ‌ట్టులో భాగ‌స్వామిగా ఉన్నాన‌ని, త‌న ఆట‌తీరును అంద‌రూ గ‌నించే ఉంటార‌ని చెప్పాడు.

రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డ‌కౌటైన అయ్య‌ర్ రెండో ఇన్నింగ్స్‌లో 30 ప‌రుగులు చేశాడు. ఇక మ‌హారాష్ట్ర‌తో జ‌రుగుత‌న్న రెండో మ్యాచ్‌లో 190 బంతుల్లో 142 ప‌రుగుల‌తో రాణించాడు.

IND vs NZ : తొలి టెస్టులో ఓట‌మి నేప‌థ్యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. స్టార్ ఆల్‌రౌండ‌ర్ వ‌చ్చేశాడు