IND vs NZ : తొలి టెస్టులో ఓట‌మి నేప‌థ్యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. స్టార్ ఆల్‌రౌండ‌ర్ వ‌చ్చేశాడు

న్యూజిలాండ్‌తో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

IND vs NZ : తొలి టెస్టులో ఓట‌మి నేప‌థ్యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. స్టార్ ఆల్‌రౌండ‌ర్ వ‌చ్చేశాడు

Washington Sundar added to Indias squad for second and third Tests

Updated On : October 20, 2024 / 6:57 PM IST

IND vs NZ 2nd Test : న్యూజిలాండ్‌తో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్ర‌మంలో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కివీస్‌తో మిగిలిన రెండు టెస్టుల‌కు ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ను తీసుకున్నారు. కివీస్‌తో సిరీస్‌కు మొద‌ట 15 మంది స‌భ్యుల‌ను ఎంపిక చేయ‌గా తాజాగా సుంద‌ర్ చేరిక‌తో 16 మంది ఆట‌గాళ్లు అయ్యారు.

రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్, ఎడమ చేతితో బ్యాటింగ్ చేసే ఆటగాడు సుంద‌ర్‌ న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం ముందుగా ప్రకటించిన జట్టు రిజర్వ్‌లో కూడా లేడు. అయితే.. 1988 తర్వాత స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ భార‌త్ ఓడిపోయిన నేప‌థ్యంలో సుంద‌ర్‌ను తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తొలి టెస్టు మ్యాచ్‌లో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా విఫ‌లం కావ‌డంతో రెండో టెస్టులో సుంద‌ర్‌ను ఆడించే అవ‌కాశాలు లేక‌పోలేదు.

KL Rahul : టెస్టుల‌కు కేఎల్ రాహుల్ రిటైర్‌మెంట్‌? తొలి టెస్టు ఓట‌మి త‌రువాత రాహుల్ చేసిన ప‌ని దేనికి సంకేతం?

కాగా.. రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా తమిళనాడు తరఫున వాషింగ్టన్‌ సుందర్ ఆడాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో భారీ సెంచరీ(269 బంతుల్లో 152; 19 ఫోర్లు, ఒక సిక్స్‌)తో సత్తా చాటాడు. ఇక సుంద‌ర్ 2021లో భార‌త్ త‌రుపున చివ‌రి సారిగా టెస్టు మ్యాచ్ ఆడాడు.

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన‌ల్ చేరుకోవాలంటే కివీస్‌తో మిగిలిన రెండు టెస్టులు భార‌త్‌కు ఎంతో కీల‌కంగా మారాయి. పూణె వేదిక‌గా అక్టోబ‌ర్ 24 నుంచి రెండో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Shubman Gill : తొలి టెస్టులో భార‌త్ ఓట‌మి.. శుభ్‌మ‌న్ గిల్ ఏం చేస్తున్నాడో చూశారా?

కివీస్‌తో రెండు, మూడో టెస్టులకు భారత జట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), జ‌స్‌ప్రీత్‌ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్‌ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.