IND vs NZ : ఐదో రోజు మైదానంలో కనిపించని రిషబ్ పంత్.. రెండో టెస్టు ఆడతాడా? లేదా?
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Rohit Sharma Provides Mammoth Injury Update On Rishabh Pant
IND vs NZ 1ST Test : బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ (99) కొద్దిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ (150)తో కలిసి 177 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే.. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేస్తుండగా రిషబ్ పంత్ మోకాలికి బంతి తగిలింది.
దీంతో నొప్పిని తాళలేక గ్రౌండ్‌ను వదిలి వెళ్లిపోయాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశాడు. మరుసటి రోజు నొప్పిని భరిస్తూనే పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఐదో రోజు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో పంత్ మైదానంలో కనిపించలేదు. దీనిపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మను విలేకరులు ప్రశ్నించారు.
IND vs NZ : తొలి టెస్టులో ఓటమి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం.. స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు
రోహిత్ ఇలా సమాధానం ఇచ్చాడు. రెండు సంవత్సరాల క్రితం పంత్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడి మోకాలికి భారీ శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న అతడు గొప్పగా పునరాగమనం చేశాడు. పునరాగమనంలోనూ ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. వికెట్ కీపింగ్ చేస్తుండగా గాయపడిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అయితే.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సౌకర్యవంతంగా కనిపించలేదని రోహిత్ అన్నాడు. అతడు వికెట్ల మధ్య పరిగెత్తలేకపోయాడన్నాడు. బంతిని బౌండరీకి తరలించేందుకే ప్రయత్నించాడన్నారు. పంత్ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు అతడు జట్టును ఏవిధంగానైతే ఆదుకుంటాడో.. అలాగే తాము కూడా అతడిపై మరింత శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు.
కీపింగ్ చేసేటప్పుడు మోకాలి వంచాల్సి వస్తుందన్నాడు. శస్త్రచికిత్స జరిగిన చోటే బాల్ తగలడంతో మోకాలు వాపు వచ్చిందన్నారు. అతడికి విశ్రాంతి అవసరం అని అందుకనే మైదానంలోకి తీసుకురాలేదని చెప్పుకొచ్చాడు. రానున్న మ్యాచులకి పంత్ వందశాతం ఫిట్‌గా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు రోహిత్ తెలిపాడు.