IPL 2025 : చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్‌.. ఐపీఎల్ హిస్ట‌రీలో ఒకే ఒక్క‌డు.. రోహిత్, ధోని, కోహ్లీల‌కు సాధ్యం కాలేదు

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Courtesy BCCI

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లో మూడు వేరు వేరు జ‌ట్ల‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చ‌డ‌మే కాక.. క్వాలిఫ‌య‌ర్‌-1కు తీసుకువెళ్లిన తొలి కెప్టెన్‌గా చ‌రిత్ర సృష్టించాడు. సోమ‌వారం జైపూర్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ పై విజ‌యం సాధించ‌డం ద్వారా శ్రేయ‌స్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

ముంబై పై విజ‌యం సాధించ‌డంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానానికి చేరుకుని క్వాలిఫ‌య‌ర్‌-1కు అర్హ‌త సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (57) హాఫ్ సెంచ‌రీ చేశాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్‌, విజ‌య్‌కుమార్ వైశాఖ్ లు త‌లా రెండు వికెట్లు తీశారు. హర్‌ప్రీత్ బ్రార్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ALSO READ : PBKS vs MI : లైవ్ మ్యాచ్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో ఆకాశ్ అంబానీ డీలింగ్‌! సోష‌ల్ మీడియాలో మీమ్స్ ఫెస్ట్‌..

అనంత‌రం జోష్‌ ఇంగ్లిస్‌ (73; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), ప్రియాంశ్‌ ఆర్య (62; 35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో లక్ష్యాన్ని పంజాబ్ 18.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ముంబై బౌల‌ర్ల‌లో మిచెల్ శాంట్న‌ర్ రెండు వికెట్లు తీశాడు. జ‌స్‌ప్రీత్ బుమ్రా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ALSO READ :  UK club cricket team : ఒక్క‌డికి బ్యాట్ ప‌ట్టుకోవ‌డం కూడా రాదా.. 2 ప‌రుగుల‌కే ఆలౌట్.. అందులో ఓ ఎక్స్‌ట్రా ర‌న్‌.. 9 మంది డ‌కౌట్..

మూడు వేరు వేరు జ‌ట్ల‌ను క్వాలిఫ‌య‌ర్స్‌కు తీసుకువెళ్లిన ఏకైక కెప్టెన్‌..

ఐపీఎల్ చరిత్రలో మూడు వేరువేరు జట్లును క్వాలిఫయర్స్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ నిలిచాడు. 2018లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ త‌న ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2020 సీజ‌న్‌లో ఢిల్లీ జ‌ట్టును ఫైన‌ల్‌కు తీసుకువెళ్లాడు. అయితే.. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఫైన‌ల్‌లో ఢిల్లీ త‌డ‌బ‌డింది. దీంతో ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

ALSO READ : PBKS vs MI : శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డని హార్దిక్ పాండ్యా..! ఏదో తేడా కొడుతుంది సామీ..

ఇక గ‌తేడాది కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టును ఫైన‌ల్‌కు తీసుకువెళ్ల‌డమే కాకుండా విజేత‌గా నిలిపాడు. తాజాగా ఈ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌ను క్వాలిఫ‌య‌ర్‌-1 తీసుకువెళ్లాడు. ఈ క్వాలిఫ‌య‌ర్‌-1 మ్యాచ్‌లో పంజాబ్ విజ‌యం సాధిస్తే ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. అదే గ‌నుక జ‌రిగితే.. మూడు జ‌ట్ల‌ను ఫైన‌ల్‌కు తీసుకువెళ్లిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ నిల‌వ‌నున్నాడు.