PBKS vs MI : లైవ్ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌తో ఆకాశ్ అంబానీ డీలింగ్! సోషల్ మీడియాలో మీమ్స్ ఫెస్ట్..
ముంబై, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఓ సంఘటన చోటు చేసుకుంది.

Courtesy BCCI
దాదాపు 11 సంవత్సరాల తరువాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అంతేకాదండోయ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో సోమవారం ముంబైని ఓడించి పాయింట్ల పట్టికలో టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసకుంది. ఈ క్రమంలో క్వాలిఫయర్ 1లో ఆడేందుకు అర్హత సాధించింది.
కాగా.. ముంబై, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఇది చోటు చేసుకుంది. బౌండరీ లైన్ వద్ద శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తుండగా.. ముంబై డగౌట్‌లో సమీపంలో ఆ జట్టు యజమాని ఆకాశ్ అంబానీ కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఆకాశ్ అంబానీ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో మాట్లాడాడు. ఇక అయ్యర్ సైతం అంబానీతో మాట్లాడేందుకు ప్రకటన బోర్డుపై వంగి కనిపించాడు. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారు అన్న విషయం అయితే తెలియరాలేదు.
సూర్యకుమార్ యాదవ్ (57; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాప్ సెంచరీ బాదడంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైశాఖ్ లు తలా రెండు వికెట్లు తీయగా.. హర్‌ప్రీత్ బ్రార్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఆ తరువాత జోష్ ఇంగ్లిస్ (42 బంతుల్లో 73 పరుగులు), ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 62 పరుగులు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని పంజాబ్ 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ముంబై బౌలర్లలో మిచెల్ శాంట్నర్ రెండు వికెట్లు తీశాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు.
It seems Shreyas Iyer wasn’t convinced with the deal Ambani offered…! pic.twitter.com/4JW2OA9pBZ
— Dinda Academy (@academy_dinda) May 26, 2025
Akash Ambani and Shreyas Iyer… #PBKSvsMI pic.twitter.com/CzeKLGnioi
— Robin (@robinchopra10) May 26, 2025