Shubman Gill : ఎట్టకేలకు మౌనం వీడిన శుభ్‌మన్ గిల్.. టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడం పై
టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంపై తొలిసారి శుభ్‌మన్ గిల్ (Shubman Gill ) స్పందించాడు.
Shubman Gill Finally Breaks Silence On Dropped T20 World Cup 2026
- టీ20 ప్రపంచకప్ 2026లో దక్కని చోటు
- ఎట్టకేలకు స్పందించిన శుభ్‌మన్ గిల్
- సెలక్టర్ల నిర్ణయం గౌరవిస్తా
Shubman Gill : టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే భారత జట్టులో స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఈ విషయం పై మౌనంగా ఉన్న గిల్ తాజాగా స్పందించాడు. సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 11 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆదివారం జరగనున్న తొలి వన్డే కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తొలి వన్డేకు ముందు టీమ్ఇండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మీడియాతో మాట్లాడాడు.
RCB : గెలుపు జోష్‌లో ఉన్న ఆర్‌సీబీకి బిగ్ షాక్..
Shubman Gill on not getting picked for 2026 T20 World Cup:
“I respect the decision and I wish team India all the best for the World Cup”. pic.twitter.com/cTfYTzm9f7
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2026
ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ 2026కి జట్టులో చోటు దక్కకపోవడం పై గిల్‌కు ప్రశ్న ఎదురైంది. దీనిపై అతడు స్పందిస్తూ తాను సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని అన్నాడు. టీ20 ప్రపంచకప్ కోసం ఎంపికైన జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందన్నాడు.
Virat Kohli : అర్ష్‌దీప్ సింగ్ రన్నింగ్ ను అనుకరించిన కోహ్లీ.. వీడియో వైరల్
అందుకనే తాను ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లు చెప్పాడు. నుదిటిన రాసి పెట్టి ఉంటే తనకు దక్కాల్సిన వన్నీ దక్కుతాయన్నాడు. ఇక ప్రతి ఆటగాడు ఎల్లప్పుడూ దేశం కోసం ఆడుతూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే కోరుకుంటాడని తెలిపాడు. తాను కూడా అంతేనని అన్నాడు. తుది నిర్ణయం సెలక్టర్ల చేతుల్లో ఉంటుందన్నాడు.
భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్..
* తొలి వన్డే మ్యాచ్ – జనవరి 11 (వడోదర)
* రెండో వన్డే మ్యాచ్ – జనవరి 14 (రాజ్ కోట్)
* మూడో వన్డే మ్యాచ్ – జనవరి 18 (ఇండోర్)
