Shubman Gill : ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ల‌కు గిల్ హెచ్చ‌రిక‌లు..! సింహంతో సెల్ఫీ తీసుకుని..

మొద‌టి టెస్టు మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ వంటి ఆట‌గాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం జంగిల్ సఫారీకి వెళ్లారు.

Shubman Gill takes selfie with lion

Shubman Gill takes selfie with lion : ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు టీ20 సిరీస్‌ను 1-1తో స‌మం చేసుకోగా వ‌న్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఇదే జోష్‌లో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ కోసం భార‌త్ సన్న‌ద్దం అవుతోంది. వాస్త‌వానికి టీమ్ఇండియా ద‌క్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను ఇంత వ‌ర‌కు గెల‌వ‌లేదు. 8 సార్లు ఆదేశంలో ప‌ర్య‌టించిన భార‌త్ రిక్త‌హ‌స్తాల‌తోనే ఇంటికి వ‌చ్చింది. అయితే.. రోహిత్ నాయక‌త్వంలో ఈ సారి ఎలాగైనా టెస్టు సిరీస్‌ను గెలిచి తీరాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

డిసెంబ‌ర్ 26 నుంచి సెంచూరియ‌న్ వేదిక‌గా మొద‌టి టెస్టు ఆరంభం కానుంది. అయితే.. తొలి టెస్టు మొద‌టి రోజు ఆట‌కు వ‌ర్షం ముప్పు పొంచిన‌ట్లుగా తెలుస్తోంది. వ‌ర్షం కార‌ణంగా మొద‌టి రోజు జ‌ర‌గ‌క‌పోవ‌చ్చున‌ని అంటున్నారు. ఏదీఏమైన‌ప్ప‌టికీ సెంచూరియ‌న్ పిచ్ మాత్రం ఫాస్ట్ బౌల‌ర్ల‌కు అనుకూలంగా ఉండ‌నుంది.

Ashwin : భార‌త జ‌ట్టుకు అతి పెద్ద శ‌త్రువు ఇత‌నే.. ఎందుకో తెలుసా..?

ఇదిలా ఉంటే.. మొద‌టి టెస్టు మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ వంటి ఆట‌గాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం జంగిల్ సఫారీకి వెళ్లారు. యువ ఆట‌గాడు శుభ్‌మన్ గిల్‌.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ ల‌తో క‌లిసి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను గిల్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఓ ఫోటోలో వీరంద‌రూ ఖడ్గమృగం మీద చేతులు వేసి ఆనందంగా ఉండ‌డాన్ని చూడొచ్చు.

అయితే.. గిల్ పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోల్లో ఒక్క‌టి మాత్రం అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే సింహంతో గిల్ తీసుకున్న సెల్ఫీ. ఈ ఫోటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయ‌కుండా సింహంతో సెల్ఫీలు ఎందుక‌న్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం.. తాను సింహం లాంటివాడిన‌ని స‌ఫారీ పేస‌ర్ల‌కు గిల్ ఈ ఫోటోతో హెచ్చరిక‌లు పంపుతున్నాడ‌ని అంటున్నారు.

Usama Mir : పుట్టిన రోజు నాడు సూప‌ర్‌ క్యాచ్.. క‌ట్ చేస్తే ఔట్ ఇవ్వ‌ని అంపైర్‌.. బుర్ర ఎక్క‌డ పెట్టావు సామీ..!