క్రికెటర్ల జెర్సీల వేలం.. టాప్‌లో శుభ్‌మాన్ గిల్.. బెన్ స్టోక్స్, బుమ్రా, పంత్‌సహా అందర్నీ వెనక్కు నెట్టేసిన యువ కెప్టెన్.. ఎంత ధర పలికిందో తెలుసా..

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌లో ఆటగాళ్లకు సంబంధించిన జెర్సీల వేలంలో అత్యధిక ధరతో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో నిలిచాడు.

క్రికెటర్ల జెర్సీల వేలం.. టాప్‌లో శుభ్‌మాన్ గిల్.. బెన్ స్టోక్స్, బుమ్రా, పంత్‌సహా అందర్నీ వెనక్కు నెట్టేసిన యువ కెప్టెన్.. ఎంత ధర పలికిందో తెలుసా..

Shubman Gill

Updated On : August 10, 2025 / 2:18 PM IST

Shubman Gills: ఇంగ్లాండ్ వేదికగా అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ‌లో భాగంగా ఇంగ్లాండ్ – భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌లు సిరీస్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ టెస్టు సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు చెరో రెండు మ్యాచ్‌లలో విజయం సాధించగా.. ఓ మ్యాచ్ డ్రా అయింది. దీంతో సిరీస్‌ సమం అయింది. ఈ టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అత్యధిక పరుగులు సాధించాడు. ఒక ద్విశతకంతోపాటు మూడు సెంచరీల సహాయంతో 754 పరుగులు సాధించాడు. అయితే, ఈ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో జరిగిన టెస్టుకు సంబంధించి ఇరు జట్ల ఆటగాళ్లు ధరించిన జెర్సీల వేలం జరిగింది. ఈ వేలంలో అందరికంటే గిల్ జెర్సీకి భారీ ధర లభించింది.

Also Read: వార్నర్ విధ్వంసం.. తగ్గేదేలే అంటూ దంచికొట్టిన బెయిర్‌స్టో.. చివరిలో బిగ్ ట్విస్ట్.. విజేతగా నిలిచిన విలియమ్సన్ జట్టు

ఈ సిరీస్‌లో పోటీపడిన ఆటగాళ్లకు సంబంధించిన జెర్సీల వేలంలో అత్యధిక ధరతో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. అతడి జెర్సీ రూ.5లక్షల41వేలకు అమ్ముడుపోయింది. ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ధరించిన జెర్సీలు, టోపీలను “రెడ్ ఫర్ రూత్ స్పెషల్ టైమ్డ్” వేలంలో గిల్ జెర్సీ అందరికంటే ఎక్కువ ధర పలికింది.

రవీంద్ర జడేజా, బుమ్రా జెర్సీలకు రూ.4.94లక్షల చొప్పు లభించగా.. కేఎల్ రాహుల్ రూ.4.70, రిషబ్ పంత్ జెర్సీ రూ.4లక్షలు పలికింది. ఇంగ్లాండ్ ప్లేయర్లలో జో రూట్ జెర్సీ రూ.4.47లక్షలు, బెన్ స్టోక్స్ జెర్సీకి రూ.4లక్షలు లభించాయి. వేలం ద్వారా లభించిన మొత్తాన్ని రూత్ స్ట్రాస్ ఫౌండేషన్‌కు అందజేస్తారు.

జో రూట్ సంతకం చేసిన క్యాప్‌లు ప్రత్యేక ప్రజాదరణ పొందాయి. ఆ విభాగంలో జో రూట్ సంతకం చేసిన క్యాప్ రూ. 3.52 లక్షలు ధరతో వేలంలో అగ్రస్థానంలో నిలిచింది.

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌ భార్య రూత్ స్ట్రాస్ స్మారకార్థం ‘రెడ్ ఫర్ రూత్’ ఫౌండేషన్‌ స్థాపించారు. రూత్ స్ట్రాస్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయారు. స్మోకింగ్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, క్యాన్సర్ బాధితులకు సపోర్ట్ అందించడం ఈ ఫౌండేషన్ ముఖ్యం లక్ష్యం. ఇందులో భాగంగానే.. భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో ఆటగాళ్లు ధరించిన జెర్సీలను వేలం వేశారు. ఇందులో వచ్చిన మొత్తాన్ని ఫౌండేషన్‌కు అందజేస్తారు.