PV Sindhu : సింగ‌పూర్ ఓపెన్‌.. రెండో రౌండ్‌లోనే ముగిసిన సింధు పోరాటం..

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది.

PV Sindhu : సింగ‌పూర్ ఓపెన్‌.. రెండో రౌండ్‌లోనే ముగిసిన సింధు పోరాటం..

PV Sindhu

Updated On : May 30, 2024 / 7:50 PM IST

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. బ్యాడ్మింట‌న్ సూప‌ర్ టోర్నీ టైటిల్ కోసం రెండేళ్లుగా నిరీక్షిస్తున్న తెలుగు తేజానికి మ‌రోసారి నిరాశే ఎదురైంది. ప్ర‌తిష్టాత్మ‌క సింగ‌పూర్ ఓపెన్ లో రెండో రౌండ్‌లో సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో ప్ర‌పంచ నంబ‌ర్ 3 ర్యాంక‌ర్ కరోలినా మారిన్(స్పెయిన్) చేతిలో ఓడిపోయింది.

21-13తో తొలి సెట్‌ను గెలిచిన సింధు అనూహ్యంగా త‌డ‌బ‌డింది. ఆ త‌రువాతి రెండు సెట్ల‌ను 11-21, 20-22 తేడాతో కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. గంటా 8 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. కాగా.. మారిన్ చేతిలో గ‌త ఆరేళ్ల కాలంలో ఆరోసారి ఓడిపోయింది. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్‌లో సింధు ప‌త‌కం గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆమె వ‌రుస వైఫ‌ల్యాల నుంచి బ‌య‌ట ప‌డాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Sourav Ganguly : టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వి.. గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కాస్త తెలివిని వాడండి