Gareth Morgan : ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. క్రికెటర్ గారెత్ మోర్గాన్ అద్భుతం
మొదటి నాలుగు వికెట్లు క్యాచ్ అవుట్ లు కాగా, చివరి రెండు వికెట్లు బౌల్డ్ అయ్యాయి. ఇది హాస్యాస్పదంగా ఉందని మోర్గాన్ అన్నారు.

cricketer Gareth Morgan
Gold Coast club cricketer Gareth Morgan : ముడ్గీరాబా నెరంగ్, డిస్ట్రిక్ట్స్ సీసీ థర్డ్ గ్రేడ్ జట్టు కెప్టెన్ గారెత్ మోర్గాన్ క్రికెట్ గోల్డ్ కోస్ట్‌లో అద్భుతాన్ని సృష్టించాడు. ఆరు బాల్స్ లో ఆరు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించారు. శనివారం సర్ఫర్స్ ప్యారడైజ్ సీసీపై నాలుగు పరుగులతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో గారెత్ మోర్గాన్ ఆరు వికెట్లు పడగొట్టాడు.
చేతిలో ఆరు వికెట్లు ఉండగా, చివరి ఓవర్‌లో సర్ఫర్స్ ప్యారడైజ్ విజయానికి ఐదు పరుగులు కావాలి. మోర్గాన్ ఆరు వికెట్లు పడగొట్టాడు. సర్ఫర్స్ ప్యారడైజ్ ఓపెనర్ జేక్ గార్లాండ్ 65 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. డీప్ మిడ్ వికెట్ వద్ద క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు.
CWC 2023: వన్డే ప్రపంచకప్.. టాప్ 5 బ్యాటర్లు, బౌలర్లు వీరే.. అశ్విన్ ఆడింది ఒక్క మ్యాచ్.. కానీ
మొదటి నాలుగు వికెట్లు క్యాచ్ అవుట్ లు కాగా, చివరి రెండు వికెట్లు బౌల్డ్ అయ్యాయి. ఇది హాస్యాస్పదంగా ఉందని మోర్గాన్ అన్నారు. గేమ్ గెలవడానికి తాను హ్యాట్రిక్ లేదా మరేదైనా తీసుకోవాలని ఓవర్ ప్రారంభంలో అంపైర్ తనతో చెప్పాడని తెలిపారు.
అయితే ఇది జరిగినప్పుడు అంపైర్ తన వైపు చూశాడని పేర్కొన్నారు. అంతకుముందు మ్యాచ్‌లో మోర్గాన్ 39 పరుగులతో ముగ్గీరాబా తరఫున టాప్-స్కోర్ చేశాడు. రెండు సార్లు బౌండరీ రోప్‌ను క్లియర్ చేశాడు.