MS Dhoni : ధోనికి షాక్‌.. సొంత అభిమానుల నుంచే రిటైర్‌మెంట్‌కు డిమాండ్‌..! ‘త‌లా’ ఇక చాలు..

ఇంకొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా ధోనిని విమ‌ర్శిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.

Some of CSK fans ask to dhoni to retire from cricket after this season

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు తొలి ఓట‌మి ఎదురైంది. శుక్ర‌వారం చెపాక్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో 50 ప‌రుగుల తేడాతో ఓడియింది. ఈ మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో క్రీజులోకి అడుగుపెట్టిన ధోని 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 30 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచినా త‌న జ‌ట్టును గెలిపించుకోలేక‌పోయాడు. కాగా.. ధోని బ్యాటింగ్‌కు వ‌చ్చే సరికే చెన్నై ఓట‌మి ఖాయ‌మైపోయింది.

ఈ క్ర‌మంలో ధోని మ‌రీ అంత దిగువ‌న బ్యాటింగ్‌కు రావ‌డాన్ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు అభిమానులు త‌ప్పుబ‌డుతున్నారు. ఒక‌వేళ ధోని బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో కాస్త ముందుగా వ‌చ్చి ఉంటే మ్యాచ్ ఫ‌లితం మ‌రో ర‌కంగా ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇంకొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా ధోనిని విమ‌ర్శిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.

Indian Express Power List 2025 : వామ్మో.. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, జ‌స్‌ప్రీత్ బుమ్రా కంటే జైషా నే ప‌వ‌ర్‌ఫుల్‌..

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ సీఎస్‌కే ఫ్యాన్ మాట్లాడిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. సీఎస్‌కే టీమ్ సెల‌క్ష‌న్‌ను త‌ప్పుబ‌ట్టాడు. దీప‌క్ హుడా వంటి ఆట‌గాళ్ల‌ను మెగావేలంలో ఎందుకు కొనుగోలు చేశారో, రాహుల్ త్రిపాఠిని ఎందుకు ఓపెన‌ర్‌గా పంపుతున్నారో అర్థం కావ‌డం లేద‌న్నాడు.

ధోనిపై ఉన్న ప్రేమ‌తో చాలా మంది బ్లాక్‌లో టికెట్లు కొని మ్యాచ్ చూసేందుకు వ‌స్తున్నామ‌న్నాడు. గ‌త కొంత‌కాలంగా ధోని 18వ ఓవ‌ర్ త‌రువాత‌నే బ్యాటింగ్‌కు వ‌స్తున్నాడ‌ని.. ఓ 20 బంతులు ఆడి ఓ సిక్స్‌, ఫోర్ కొట్ట‌గానే అంద‌రూ ధోని ధోని అంటూ అత‌డి నామ‌స్మ‌ర‌ణ చేస్తున్నార‌ని మండిప‌డ్డాడు.  ఇలా ఆడ‌డం వ‌ల్ల‌ పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌ద‌ని చెప్పుకొచ్చాడు. 13వ ఓవ‌ర్‌లోనే బ్యాటింగ్‌కు వ‌స్తే బాగుంటుంద‌ని.. కానీ రాడ‌ని అన్నాడు. ఇక ఈ సీజ‌న్ త‌రువాత ఆట‌కు ధోని రిటైర్‌మెంట్ ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. మ‌రికొంద‌రు సీఎస్‌కే ఫ్యాన్స్ కూడా ఇలాంటి అభిప్రాయ‌మే వ్య‌క్తం చేస్తున్నారు.

GT vs MI : గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్‌కు శుభ‌వార్త‌.. ఆ డేంజ‌ర‌స్‌ ప్లేయ‌ర్ వ‌చ్చేశాడు..

సొంత అభిమానుల నుంచే విమ‌ర్శ‌లు ఎందుకు..?

టీమ్ఇండియాకు మూడు ఐసీసీ టోర్నీల‌ను అందించిన ధోని, చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఐదు ఐపీఎల్ టైటిళ్ల‌ను అందించాడు. ఈ క్రమంలో చెన్నై అంటే ధోని, ధోని అంటే చెన్నై అనేంత‌లా మారిపోయింది. ఇక ధోని కోస‌మే చెన్నై ఫ్యాన్స్ మ్యాచ్‌ల‌ను చూసేందుకు స్టేడియాల‌కు వ‌స్తున్నారంటే అతి శ‌యోక్తి కాదు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి దాదాపు ఐదేళ్లు కావొస్తున్నా..ధోని ఇంకా ఐపీఎల్‌లో కొన‌సాగుతూనే ఉన్నాడు. గ‌త కొన్ని సీజ‌న్లుగా అత‌డు రిటైర్‌మెంట్ అవుతాడు అంటూ ప్ర‌చారం సాగుతోంది. అయితే.. ధోని మాత్రం వాటిని రూమ‌ర్లుగానే చేస్తూ సీఎస్‌కు ఆడుతున్నారు. అయితే.. వికెట్ల వెనుక అత‌డి సామ‌ర్థం పై ఎవ్వ‌రికి ఎలాంటి అనుమానాలు లేవు. ఇప్ప‌టికి కూడా కుర్రాళ్ల కంటే ఎంతో మెరుగ్గా కీపింగ్ చేస్తున్నారు. మెరుపు వేగంగా స్టంపౌంట్ల‌ను చేస్తున్నాడు. కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం మునుప‌టి ప‌దును లేదు అనేది వాస్త‌వం.

వేలంలో అన్‌సోల్డ్.. శార్దూల్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన జ‌హీర్ ఖాన్ ఫోన్ కాల్‌..

గ‌త కొన్ని సీజ‌న్లుగా అత‌డు మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. ఈక్ర‌మంలో అత‌డు ప‌రుగులు తీసేందుకు ఇబ్బంది ప‌డుతున్నాడు. శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నా పెద్ద‌గా ప్ర‌భావం ఉన్న‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో అత‌డు మ్యాచ్ చివ‌రి రెండు మూడు ఓవ‌ర్ల‌లో బ్యాటింగ్‌కు వ‌స్తూ కొన్ని బౌండ‌రీలు కొడుతూ ఫ్యాన్స్ ను అల‌రిస్తున్నాడు. అయితే.. మ్యాచ్ విన్న‌ర్ అయిన ధోని ఆఖ‌రిలో వ‌స్తూ మ్యాచ్‌ల‌ను గెలిపించ‌లేక‌పోగా.. కొన్ని షాట్ల‌కే ప‌రిమితం కావ‌డం పై ప‌ట్ల గ‌త కొన్నాళ్ల నుంచి కొంద‌రు ఫ్యాన్స్ లో అసంతృప్తి నెల‌కొని ఉంది.

ఆర్‌సీబీపై మ్యాచ్ ఓడిపోవ‌డంతో..

17 ఏళ్ల పాటు చెన్నైలోని చెపాక్‌ మైదానంలో రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు సీఎస్‌కే పై విజ‌యం సాధించ‌లేదు. శుక్ర‌వారం మాత్రం చెన్నై పై అల‌వోక‌గా విజ‌యం సాధించింది. ఇందులో సీఎస్ కే ఫీల్డ‌ర్ల వైఫ‌ల్యం ఆర్సీబీకీ క‌లిసి వ‌చ్చింది. ఇక‌ ల‌క్ష్య ఛేద‌న‌లో ఓ వైపు వికెట్లు పోతున్నా.. జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ ముందుగా వ‌చ్చారు గానీ ధోని మాత్రం బౌల‌ర్లు ఎక్కువ‌గానే ఆడే తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. అత‌డు రాణించిన‌ప్ప‌టికి కూడా జ‌ట్టుకు ఓట‌మి ఖరారు అయిన త‌రువాత‌నే రావ‌డంతో గ‌త కొన్నాళ్లుగా ఉన్న అసంతృప్తిని ఇప్పుడు ఫ్యాన్స్‌ బ‌య‌ట‌పెడుతున్నారు.

CSK vs RCB : ఆర్‌సీబీ చేతిలో ఓట‌మి.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ వింత వ్యాఖ్య‌లు.. సంతోషంగా ఉంది..

గ‌త సీజ‌న్‌లో లాగే ఈ సీజ‌న్‌లో కూడా చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేర‌డంలో విఫ‌లం అయితే మాత్రం ధోని రిటైర్‌మెంట్ తీసుకుంటే మంచిద‌నే డిమాండ్ ఇంకాస్త పెరిగినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సం లేదు.