Heinrich Klaasen : టెస్ట్ ఫార్మాట్‌కు సౌతాఫ్రికా క్రికెటర్ రిటైర్మెంట్.. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఏ జట్టులో ఉన్నాడంటే?

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Heinrich Klaasen : టెస్ట్ ఫార్మాట్‌కు సౌతాఫ్రికా క్రికెటర్ రిటైర్మెంట్.. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఏ జట్టులో ఉన్నాడంటే?

Heinrich Klaasen

Heinrich Klaasen : దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ టెైస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2017 ఫిబ్రవరిలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ తో దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో క్లాసెన్ ఎంపికయ్యాడు. కానీ, ఆడలేదు. 2019 ఆగస్టులో భారతదేశంలో దక్షిణాఫ్రికా జట్టు పర్యటించింది. టెస్టు సిరీస్ సమయంలో ఆజట్టు ప్లేయర్ రూడీ గాయపడ్డాడు. అతని స్థానంలో సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో క్లాసెన్ చేరాడు. 19 అక్టోబర్ 2019లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రాంచీలో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. 2019 -2023 మధ్యలో టెస్ట్ ఫార్మాట్ లో కేవలం నాలుగు మ్యాచ్ లు మాత్రమే క్లాసెన్ ఆడాడు. ఎనిమిది ఇన్నింగ్స్ లో 104 రన్స్ చేశాడు. హెన్రిచ్ క్లాసెస్ వైట్ -బాల్ ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా జట్టుకు అందుబాటులో ఉంటాడు.

Also Read : Flash Flood : ఇదేందిదీ.. వ‌ర్షం లేదు.. అయినా పిచ్ పై వ‌ర‌ద‌.. వీడియో వైర‌ల్‌

ఈ ఏడాది ప్రారంభంలో భారత్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా సౌతాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ తరువాత టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా రెండవ సీనియర్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెస్. రిటైర్మెంట్ ప్రకటన తరువాత క్లాసెస్ మాట్లాడుతూ.. నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా? అని కొన్ని నిద్రలేని రాత్రులు ఆలోచించాను. చివరికి నేను రెడ్ -బాల్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం. క్రికెట్ లో నాకు ఇష్టమైన ఫార్మాట్ టెస్ట్ క్రికెట్. ఇది గొప్ప ప్రయాణం. టెస్ట్ ఫార్మాట్ లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషంగా ఉంది, నా బ్యాగీ టెస్ట్ క్యాప్ నాకు అందజేసిన అత్యంత విలువైన క్యాప్. క్లాసెస్ అన్నాడు. ఇదిలాఉంటే దక్షిణాప్రికా జట్టు 2024లో మరో ఏడు టెస్టులు ఆడనుంది. వెస్టిండీస్, బంగ్లాదేశ్ తోపాటు, శ్రీలంకతో స్వదేశంలో, పాకిస్థాన్ టెస్టు మ్యాచ్ లు ఆడనుంది.

Also Read : Rishabh Pant : రిష‌బ్‌ పంత్ ఇంట త్వ‌ర‌లో మోగ‌నున్న పెళ్లి బాజాలు.. 9 ఏళ్ల నుంచి ల‌వ్‌..

క్లాసెన్ తన రిటైర్మెంట్ నిర్ణయం వెనుక కారణాన్ని వెల్లడించలేదు. కానీ, అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్, ది హండ్రెడ్ అండ్ మేజర్ లీగ్ క్రికెట్ పూర్తి సీజన్ ఆడేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 2024లో జరిగే ఐపీఎల్ టోర్నీలో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తరపున హన్రిచ్ క్లాసెన్ ఆడనున్నాడు. ఐపీఎల్ లో ప్రముఖ బ్యాటర్ లలో క్లాసెన్ ఒకడు.