భారత్‌లో సఫారీల టీ20 సవారీ

భారత్‌లో పర్యటించడానికి సిద్ధమైన దక్షిణాఫ్రికా జట్టు న్యూ ఢిల్లీకి చేరుకుంది. టీ20లు, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు బయల్దేరిన జట్టు సెప్టెంబరు 15న తొలి మ్యాచ్ ఆడనుంది. క్వింటన్ డి కాక్ కెప్టెన్సీలో టీ20 ఫార్మాట్ ఆడేందుకు సఫారీలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ధర్మశాల వేదికగా సెప్టెంబర్ 15న తొలి టీ20 ఆడనున్నాయి ఇరు జట్లు.
రెండో టీ20 సెప్టెంబర్ 18న మొహాలీ వేదికగా, మూడో టీ20 సెప్టెంబర్ 22న బెంగళూరు వేదికగా జరగనుండగా.. ఆ తర్వాత టెస్టు సిరీస్ జరగనుంది. మూడు టెస్టుల్లో భాగంగా జరిగే సిరీస్‌లో తొలి టెస్టు అక్టోబర్ 2న రెండో టెస్టు అక్టోబర్ 10న, మూడో టెస్టు అక్టోబర్ 19న జరగనున్నాయి.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుపై ఇండియా తలపడుతోంది. టెస్టు చాంపియన్ షిప్‌లో వెస్టిండీస్‌తో ఆడిన తర్వాత దక్షిణాఫ్రికాతో ఆడుతోంది కోహ్లీసేన.
దక్షిణాఫ్రికా టీ20 జట్టు:
క్వింటన్ డి కాక్ (సి), రాస్సీ వాన్ డెర్ డుసెన్ (బిసి), టెంబా బావుమా, జూనియర్ దాలా, జోర్న్ ఫోర్టుయిన్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, రీజా హెన్డ్రిక్స్, డేవిడ్ మిల్లెర్, అన్రిచ్ నార్ట్జే, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, జార్జ్ లిండ్స్
భారత టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (విసి), కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, క్రునాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీక్ అహ్మద్ , నవదీప్ సైని