SRH : హైద‌రాబాద్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఉప్ప‌ల్‌లో ఎన్ని మ్యాచులో తెలుసా?

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ (ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌) 2024 షెడ్యూల్ వ‌చ్చేసింది.

SRH play 4 matches in first leg schedule in IPL 2024

Sunrisers Hyderabad : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ (ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌) 2024 షెడ్యూల్ వ‌చ్చేసింది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఐపీఎల్ నిర్వాహ‌కులు కేవ‌లం 17 రోజుల షెడ్యూల్‌ను మాత్ర‌మే ప్ర‌క‌టించారు. 21 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నైసూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. చెన్నైలోని చెపాక్ మైదానంలో మార్చి 22న ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఇక సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ను ఢీ కొట్ట‌నుంది. మార్చి 23న కోల్‌క‌తా వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఫ‌స్ట్ షెడ్యూల్ ప్ర‌కారం హైదరాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో రెండు మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 27న ముంబై ఇండియ‌న్స్‌, ఏప్రిల్ 5న చెన్నైతో మ్యాచ్‌ల‌ను సొంత మైదానంలో హైద‌రాబాద్ ఆడ‌నుంది.

European T10 cricket : టీ10 క్రికెట్‌లో ప్ర‌పంచ రికార్డు.. 21 బంతుల్లోనే సెంచ‌రీ..

ఎస్‌ఆర్‌హెచ్ షెడ్యూల్ ఇదే..

మార్చి 23 – కోల్‌కతా వర్సెస్‌ హైదరాబాద్ – కోల్‌కతా
మార్చి 27 – హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబై – హైదరాబాద్‌
మార్చి 31 – గుజరాత్‌ వర్సెస్‌ హైదరాబాద్ – అహ్మదాబాద్‌
ఏప్రిల్‌ 5 – హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై – హైదరాబాద్‌

ఐపీఎల్ 2024కు ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు ఇదే..
ఎయిడెన్‌ మార్క్‌రమ్‌(కెప్టెన్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌, ట్రావిస్‌ హెడ్‌, వనిందు హసరంగ, పాట్‌ కమిన్స్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్కో జాన్సెన్‌, ఫజల్‌హక్‌ ఫరూఖీ, అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మయాంక్‌ అగర్వాల్‌, టి.నటరాజన్‌, సన్విర్‌ సింగ్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, మయాంక్‌ మార్ఖండే, ఉపేంద్ర సింగ్‌ యాదవ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, షాబాజ్‌ అహ్మద్‌, జతవేద్‌ సుబ్రహ్మణ్యన్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, ఆకాశ్‌ సింగ్‌.

IND vs ENG : రాంచీలో గెలిచేందుకు ఇంగ్లాండ్ ప‌క్కా వ్యూహాం.. తుది జ‌ట్టులో కీల‌క మార్పులు.. ఆ ఇద్ద‌రికి చోటు

గ‌త సీజ‌న్‌లో..

ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో కూడా ఎయిడెన్‌ మార్క్‌రమ్ సార‌థ్యంలోనే ఎస్ఆర్‌హెచ్ బ‌రిలోకి దిగింది. ఈ సీజ‌న్‌లో అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో ఘోరంగా విఫ‌లమైంది. 14 మ్యాచులు ఆడిగా నాలుగు అంటే నాలుగు మ్యాచుల్లోనే గెలిచింది. 10 మ్యాచుల్లో ఓడిపోయింది. 8 పాయింట్లతో ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. దీంతో ఎస్ఆర్ హెచ్ మేనేజ్‌మెంట్ ఇటీవ‌ల జ‌రిగిన మినీ వేలంలో విదేశీ ఆట‌గాళ్ల‌కు పెద్ద పీట వేసింది. ఆసీస్ కెప్టెన్ పాట్ క‌మిన్స్‌కు రూ.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అత‌డిపై భారీ ఆశ‌ల‌నే పెట్టుకుంది.

ట్రెండింగ్ వార్తలు