IPL Tickets Black Market: వామ్మో.. బాక్స్ టికెట్ ధర లక్ష రూపాయలు..! బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు..
ఈ మ్యాచ్ టికెట్ల కోసం ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. కాగా, కొందరు మంత్రుల రిఫరెన్స్ పెట్టినా టికెట్లు దొరకడం లేదని తెలుస్తోంది.
IPL Tickets Black Market: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు ఎస్ఆర్ హెచ్ (సన్ రైజర్స్ హైదరాబాద్), ఆర్సీబీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) మ్యాచ్ జరగనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కు ప్రేక్షకుల నుంచి భారీగా ఆదరణ ఉంది. దీంతో దీన్ని బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. దొరికిందే అదనుగా బ్లాక్ దందాకు తెరలేపారు.
ఎస్ఆర్ హెచ్, ఆర్సీబీ మ్యాచ్ టికెట్లకు భారీగా డిమాండ్ ఉండటంతో బ్లాక్ టికెటింగ్ కు తెరలేపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్కో టికెట్ ను భారీ మొత్తంలో విక్రయిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో కామన్ క్రికెట్ ఫ్యాన్స్ కు టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణంగా వెయ్యి రూపాయల టికెట్ బ్లాక్ మార్కెట్లో 5 వేల నుంచి 10 వేల రూపాయల వరకు అమ్ముడవుతోందని సమాచారం. అయినా టికెట్లు దొరకడం లేదని అభిమానులు వాపోతున్నారు.
బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు బరి తెగించారు. వెయ్యి రూపాయల టికెట్ ను ఏకంగా 5వేల రూపాయలకు పైగానే విక్రయిస్తున్నారు. ఒక్కో బాక్స్ టికెట్ ధర లక్ష రూపాయల వరకు వెళ్తుండగా.. పూర్తి కార్పొరేట్ బాక్స్ కు 10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా రెకమెండేషన్ ఉంటేనే టికెట్లు దొరుకుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ టికెట్ల కోసం ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. కాగా, కొందరు మంత్రుల రిఫరెన్స్ పెట్టినా టికెట్లు దొరకడం లేదని తెలుస్తోంది.
సైబర్ క్రిమినల్స్ ఎంట్రీ.. ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ తో బురిడీ..
మరోవైపు ఇదే అదనుగా సైబర్ క్రిమినల్స్ ఎంట్రీ ఇచ్చారు. మ్యాచ్ కున్న క్రేజ్ ను సొమ్ము చేసుకునేందుకు రెడీ అయిపోయారు. ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ ను మార్కెట్ లోకి వదిలారు సైబర్ నేరగాళ్లు. ఇప్పటికే టికెట్లు దొరక్క ఫ్యాన్స్ గగ్గోలు పెడుతుంటే మరోవైపు సైబర్ నేరగాళ్లు తగులుకుంటున్నారు. నకిలీ యాప్ లో టికెట్స్ ఈజీగా బుక్ అవుతుండటంతో చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆ నకిలీ యాప్ లోనే భారీగా టికెట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఆ యాప్ ను గుర్తించిన పోలీసులు వెంటనే క్రికెట్ ఫ్యాన్స్ ను అప్రమత్తం చేశారు. అది నకిలీ యాప్ అని, అందులో టికెట్స్ కొనుగోలు చేయొద్దని చెప్పారు. కానీ, అప్పటికే వేలాది మంది టికెట్స్ కొనేశారు. నకిలీ యాప్ లో కొన్న టికెట్స్ ఉంటే మ్యాచ్ కి అనుమతించేది లేదని సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో టికెట్స్ కొన్న ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. తాము కొన్న టికెట్ అసలుదా? నకిలీదా? అనేది తెలియక తెగ వర్రీ అయిపోతున్నారు.
HCA టికెట్లు సైతం బ్లాక్ మార్కెట్ లోకి…
మరో వైపు HCA క్లబ్ టికెట్స్, మీడియా టికెట్స్ సైతం బ్లాక్ మార్కెట్ లో అమ్మేసుకుంటున్నారు. మీడియా కి టికెట్స్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు చూపించి బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకుంటున్నారు HCA పెద్దలు. బ్లాక్ మార్కెట్లో అత్యధికంగా కాంప్లిమెంటరీ టికెట్స్ ఉన్నాయి. క్రేజీ మ్యాచ్ ను HCA క్యాష్ చేసుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
Also Read: ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు
