SRHvsDC: సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 156

ఐపీఎల్ లో భాగంగా జరుగుతోన్న పోరులో ఢిల్లీ క్యాపిటల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కు 156 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్లు పృథ్వీ షా(4), శిఖర్ ధావన్(7)లు కలిసి పేలవంగా ఆరంభించిన ఇన్నింగ్స్ ను కొలిన్ మన్రో(40; 24 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సులు), శ్రేయాస్ అయ్యర్(45; 40 బంతుల్లో 5 ఫోర్లు)తో చక్కదిద్దారు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(23) శ్రమించినప్పటికీ నిలదొక్కుకోలేకపోయాడు. క్రిస్ మోరిస్(4), అక్సర్ పటేల్(14), కీమో పాల్(7), కగిసో రబాడ(2)పరుగులతో సరిపెట్టుకున్నారు. హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్(3)వికెట్లు తీగా, భువనేశ్వర్ కుమార్(2), అభిషేక్ శర్మ(1), రషీద్ ఖాన్(1)వికెట్ తీయగలిగారు.