SRHvsKKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

ఉప్పల్ వేదికగా జరుగుతోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ పోరు రసవత్తరంగా సాగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్‌కతా హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది.  ఐపీఎల్ 2019వ సీజన్‌లో 38వ మ్యాచ్‌కు పాల్గొంటున్న ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్నాయి. 

ఈ మ్యాచ్ ప్రత్యేకమిటంటే దీంతో పాటు కలిపి మరొక్క మ్యాచ్‌లోనే డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలు ఆడనున్నారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ కోసం తమ జాతీయ జట్లతో కలిసి ప్రాక్టీస్ చేసేందుకు బయల్దేరనున్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన బెయిర్ స్టో.. తాను వెళ్లే లోపే జట్టును ప్లే ఆఫ్‌కు అర్హత సాధించే పాయింట్లు తెచ్చిపెడతాననే విశ్వాసం వ్యక్తం చేశాడు. 

కోల్‌కతా 3 మార్పులతో బరిలోకి దిగుతోంది. రాబిన్ ఊతప్ప, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్  కృష్ణలు జట్టుకు దూరమవడంతో రింకూ సింగ్, కేసీ కరియప్ప, పృథ్వీ రాజ్ యర్రా తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. 

కోల్‌కతా నైట్ రైడర్స్:

క్రిస్ లిన్, సునీల్ నరైన్, రింకూ సింగ్, నితీశ్ రానా, శుభ్‌మాన్ గిల్, దినేశ్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్, పీయూశ్ చావ్లా, కేసీ కరియప్ప, గర్నీ, పృథ్వీ రాజ్ యర్రా

సన్‌రైజర్స్ హైదరాబాద్:

డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, దీపక్ హుడా, యూసఫ్ పఠాన్, రషీద్ ఖాన్, షెహబాజ్ నదీమ్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్