ఐపీఎల్ 2019లో దాదాపు లీగ్ మ్యాచ్‌లు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. ఈ క్రమంలో ప్రతి జట్టు ఫలితాలు నువ్వానేనా అన్నట్లు తయారవడంతో రాజస్థాన్ వేదికగా రాజస్థాన్ రాయల్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆఖరి సారిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన మ్యాచ్‌లో కుటుంబ పరిస్థితుల కారణంగా న్యూజిలాండ్ కు వెళ్లిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ కు అందుబాటులోకి రానున్నాడు. కాకపోతే వికెట్ కీపర్‌గా లీగ్ ఆరంభం నుంచి కొనసాగుతున్న హిట్టర్ బెయిర్ స్టో మ్యాచ్‌కు దూరమైయ్యాడు. అతని స్థానంలో వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా జట్టులోకి చేరాడు.
జట్లు:
Rajasthan Royals: Ajinkya Rahane, Sanju Samson(w), Steven Smith(c), Riyan Parag, Ashton Turner, Liam Livingstone, Stuart Binny, Shreyas Gopal, Jaydev Unadkat, Varun Aaron, Oshane Thomas
Sunrisers Hyderabad : David Warner, Kane Williamson(c), Manish Pandey, Vijay Shankar, Shakib Al Hasan, Wriddhiman Saha(w), Deepak Hooda, Rashid Khan, Bhuvneshwar Kumar, Siddarth Kaul, K Khaleel Ahmed