Cristiano Ronaldo: మరో మైలురాయిని చేరుకోనున్న స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ..

ఫుట్‌బాల్‌లో పురుషుల విభాగంలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల వివరాలను చూస్తే.. రొనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) 199 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.

Cristiano Ronaldo: మరో మైలురాయిని చేరుకోనున్న స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ..

Cristiano Ronaldo

Cristiano Ronaldo: ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయిని చేరుకోనున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పురుషుల విభాగంలో అత్యధిక మ్యాచ్‌లు (199) ఆడిన ప్లేయర్‌గా రొనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. తాజాగా యూరో 2024 క్వాలిఫైయింగ్‌లో తన 200వ అంతర్జాతీయ మ్యాచ్ ద్వారా మరో మైలురాయిని రొనాల్డో అందుకోనున్నాడు. మ్యాచ్‌కు ముందు రొనాల్డో మాట్లాడుతూ.. నేను ఇక్కడికి (పోర్చుగల్ జాతీయ జట్టుకు) రావడాన్ని ఎప్పటికీ వదులుకోను, ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ ఒక కల అని అన్నారు. 200 అతర్జాతీయ మ్యాచ్‌లను చేరుకోవడం ఎవరికో కాదు, ఇది నా దేశం, నా జట్టుపై నాకు ఉన్న ప్రేమను చూపుతుందని రొనాల్డో చెప్పాడు. ఈ ఏడాది ప్రారంభంలో పోర్చుగల్ కోచ్‌గా రాబర్టో మార్టినెజ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రొనాల్డో మూడు గేమ్‌లలో నాలుగు గోల్స్ చేశాడు.

Cristiano Ronaldo Private Jet: రొనాల్డో ప్రైవేట్ జెట్ చూశారా..! ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేసిన జార్జినా

అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు.. 

ఫుట్‌బాల్‌లో పురుషుల విభాగంలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల వివరాలను చూస్తే.. రొనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) 199 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తరువాతి స్థానంలో బాదర్ అల్ – ముతావా (కువైట్) ఉన్నాడు. అతను 196 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. మూడో స్థానంలో కాబటి చిన్‌అన్ (మలేషియా) 195 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. అహ్మద్ హసన్ (ఈజిప్ట్) 184 అంతర్జాతీయ మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. 183 అంతర్జాతీయ మ్యాచ్‌లతో అహ్మద్ ముబారక్ ఐదో స్థానంలో నిలిచాడు. లియోనెల్ మెస్సి (అర్జెంటీనా) 175, సునీల్ ఛెత్రీ (భారత్) 137 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు.

Cristiano Ronaldo: క్రిస్టియానో ​​రోనాల్డో భారీ ఒప్పందం.. రోజుకు, నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

354 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన లిల్లీ.. 

యూరో 2024 క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌తో క్రిస్టియానో రొనాల్డో 200 అంతర్జాతీయ మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంటాడు. అయితే, మహిళల విభాగంలో 26మంది 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారు ఉన్నారు. నలుగురు మహిళలు 300 అంతర్జాతీయ మ్యాచ్‌లకుపైగా ఆడారు. ఫుట్‌బాల్‌లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రికార్డు యూఎస్‌కు చెందిన క్రిస్టీన్ లిల్లీ (354) పేరిట ఉంది.