ఇంటికి కెప్టెన్: గుడ్ బై చెప్పేసిన స్టీవ్ స్మిత్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్ 2019కు గుడ్ బై చెప్పేశాడు.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్ 2019కు గుడ్ బై చెప్పేశాడు.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్ 2019కు గుడ్ బై చెప్పేశాడు. వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్‌కు హాజరవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి పిలుపురావడంతో తిరుగుప్రయాణం పట్టాడు. బాల్ ట్యాంపరింగ్ నిషేదం కారణంగా సంవత్సరం పాటు సీజన్‌కు విరామం ఇచ్చి పునరాగమనం చేసిన స్మిత్.. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 

చివరి మ్యాచ్‌లో చక్కగా రాణించి రాజస్థాన్‌కు మంచి వీడ్కోలు ఇద్దామని ఆశించాడు. కానీ, వరుణుడు అడ్డం రావడంతో మ్యాచ్‌ను అనేక అవాంతరాల మధ్య కొనసాగించలేకపోయారు. ఈ సీజన్లో స్మిత్ 12మ్యాచ్‌లు ఆడి 3హాఫ్ సెంచరీలతో కలిపి 319పరుగులు చేశాడు. 
Also Read : భవిష్యత్ టీమిండియా కోచ్‌గా రిక్కీ పాంటింగ్: గంగూలీ

లీగ్‌లో తొలి 8గేమ్‌లు పూర్తి అయిన తర్వాత రహానె నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. తర్వాత ఆడిన ఐదు మ్యాచ్‌లలో 3 గెలిచి జట్టును విజయపథంలో నిలిపాడు. ఆరంభంలో వరుస ఓటములతో సతమతమై చెత్తరికార్డును నమోదు చేసుకున్న రాజస్థాన్‌ను ఒడ్డుకు చేర్చాడు. 

ఈ మేర తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాజస్థాన్ రాయల్స్ వదిలి వెళుతూ వీడ్కోలు సందేశం పోస్టు చేశాడు. ‘రాజస్థాన్ రాయల్స్ ఈ 7వారాలకు థాంక్యూ. ప్రతి నిమిషం చాలా ఎంజాయ్ చేశాను. ఇంతగొప్ప ఫ్రాంచైజీతో కలిసి ప్రయాణించినందుకు సంతోషంగా ఉంది. గుడ్ లక్ ఢిల్లీ బాయ్స్’ అంటూ పోస్టు చేశాడు.