హ్యాపీ దీపావళి చెప్తోన్న స్టీవ్ స్మిత్

దీపావళి పండుగ రోజున ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ భారత అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ లోనే కాకుండా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహించే స్టీవ్ స్మిత్‌కు భారత్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. నిషేదం పూర్తి చేసుకుని ఈ ఏడాదే ఐపీఎల్ లో ఆడిన స్మిత్ కు చక్కటి స్వాగతం లభించింది.
ఇటీవల అంతర్జాతీయ టీ20ల్లోనూ ఆడేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇది చాలా మంచి విషయం. ఆడటానికి వెయిట్ చేయలేకపోతున్నా. ఆస్ట్రేలియాకు తిరిగి ఆడటం సంతోషంగా ఉంది’ అని స్టీవ్ స్మిత్ తెలిపాడు.
దీపావళి సందర్భంగా భారత అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ప్లేయర్లలో స్మిత్ తో పాటు, క్రిస్ గేల్ కూడా ఉన్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న గేల్.. తన అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశాడు.