Stuart Binny: అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ వీడ్కోలు!
టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.

Stuart Binny
Stuart Binny: టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. అంతేకాదు తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బిన్నీ తెలిపాడు. 37 ఏళ్ల స్టువర్ట్ బిన్నీ ఈ సందర్భంగా బీసీసీఐతోపాటు తన దేశవాళీ టీమ్ కర్ణాటకకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు.
1983లో క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచిన టీమ్‌లో సభ్యుడైన రోజర్ బిన్నీ కుమారుడే ఈ స్టువర్ట్ బిన్నీ. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉన్నదని అన్నాడు. టీమిండియా తరపున బిన్నీ 6 టెస్టులు, 14 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 95 మ్యాచులు ఆడి 4,796 పరుగులు చేసి 146 వికెట్లు పడగొట్టాడు.
ఇండియా తరఫున స్టువర్ట్ బిన్నీకి ఓ మరుపురాని మ్యాచ్ ఉంది. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బిన్నీ లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును తిరగరాశాడు. ఆ మ్యాచ్‌లో 4.4 ఓవర్లు వేసిన అతడు.. కేవలం 4 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఇండియా తరఫున వన్డేల్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.