Sunil Gavaskar Fire on Gautam Gambhir Over Workload Stance
గత కొన్నాళ్లుగా టీమ్ఇండియాలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ (పని భారం నిర్వహణ) పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఆ ఆపోహను తొలగించాడని టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తెలిపాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్‌ను ప్రశంసించాడు.
ఈ సిరీస్‌లో సిరాజ్ 185.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. దీనిపై గవాస్కర్ మాట్లాడుతూ.. సిరాజ్ నిబద్ధత అద్భుతం అని కొనియాడాడు. వర్క్‌లోడ్‌లో శారీరకంగా కంటే మానసికంగా బలోపేతంగా ఉండటం చాలా ముఖ్యం అని సిరాజ్ నిరూపించాడన్నాడు. ఇతరులు తనను ఒక ఉదాహరణగా చూస్తారని, భారత క్రికెట్ డిక్షనరీలో ఇక పై వర్క్‌లోడ్ అనే పదం తొలగిపోతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు.
సిరీస్ అనంతరం గవాస్కర్ మాట్లాడుతూ.. బౌలర్లే మ్యాచ్‌ను గెలిపిస్తారనే ఓ సామెత ఉంది. కానీ అసలు నిజం ఏంటంటే వారు కూడా పరుగులు సాధిస్తేనే విజయం ఈజీగా వస్తుందన్నాడు. తొలి మ్యాచ్‌లో పరుగులు చేయకపోవడంతో ఓడిపోయారన్నాడు. అయితే.. సిరాజ్ మాత్రం బౌలింగ్‌తో అద్భుతాలు చేయవచ్చునని చూపించాడని చెప్పుకొచ్చాడు. వర్క్‌లోడ్ అనే పదాన్ని పక్కన పెట్టేలా సిరాజ్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం అని తెలిపాడు.
భారత క్రికెట్ డిక్షనరీ నుంచి ఇక వర్క్‌లోడ్ అనే పదాన్ని శాశ్వతంగా తొలగించాలన్నాడు. ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని తెలిపాడు. ఇక సిరాజ్ వరుసగా ఐదు టెస్టు మ్యాచ్‌ల్లోనూ.. 6, 7, 8 ఓవర్ల స్పెల్స్ వేశాడని గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్ ఎప్పుడు బంతి ఇచ్చినా కూడా సిరాజ కాదనకుండా బౌలింగ్ చేశాడన్నారు. అతడి నుంచి దేశం కూడా అదే ఆశించిందన్నాడు. అందుకనే వర్కలోడ్ అనేది శారీరకంగా కంటే మానసికంగా చాలా ముఖ్యం అని గవాస్కర్ తెలిపాడు.
జవాన్లు ఎప్పుడూ ఫిర్యాదు చేయరు..
వర్క్‌లోడ్ విషయంలో తలొగ్గితే.. మైదానంలోకి అత్యుత్తమ ఆటగాళ్లను బరిలోకి దింపలేమని గవాస్కర్ తెలిపాడు. దేశం కోసం ఆడుతున్నామనే మాట వారికి చెప్పాలన్నాడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు కండరాల నొప్పులు, బాధలను మరిచిపోవాలన్నాడు. సరిహద్దుల్లో ఉండే జవాన్లు ఎప్పుడైన చలిగా ఉందని ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించాడు.
వారు దేశం కోసం తమ ప్రాణాలను సైతం ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉంటారు. అలాంటప్పుడు మీరు దేశం కోసం మీ అత్యుత్తమ ప్రదర్శన చేయలేరా? పశ్నించాడు. రిషబ్ పంత్‌నే కాస్త చూడండి. అతడు కాలికి ప్రాక్చర్ అయినా గానీ జట్టు కోసం బ్యాటింగ్ చేశాడు. మీ నుంచి కూడా జట్టు ఇదే ఆశిస్తోందని గవాస్కర్ అన్నాడు.
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని సిరీస్ ప్రారంభానికి ముందే టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక బుమ్రా కూడా సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. దీనిపైనే గవాస్కర్ పరోక్షంగా గంభీర్, బుమ్రాలను విమర్శించినట్లు తెలుస్తోంది.