IND U-19 vs SA U 19 : విజృంభించిన బౌల‌ర్లు.. టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే?

మూడు మ్యాచ్‌ల యూత్ వ‌న్డే సిరీస్‌లో భాగంగా (IND U-19 vs SA U 19) విల్లోమూర్ పార్క్ వేదిక‌గా భార‌త్ అండ‌ర్‌-19, ద‌క్షిణాఫ్రికా అండ‌ర్‌-19 జ‌ట్లు రెండో మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి.

IND U-19 vs SA U 19 : విజృంభించిన బౌల‌ర్లు.. టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే?

South Africa U19 vs India U19 2nd Youth ODI Team India target is 246

Updated On : January 5, 2026 / 4:49 PM IST

IND U-19 vs SA U 19 : మూడు మ్యాచ్‌ల యూత్ వ‌న్డే సిరీస్‌లో భాగంగా విల్లోమూర్ పార్క్ వేదిక‌గా భార‌త్ అండ‌ర్‌-19, ద‌క్షిణాఫ్రికా అండ‌ర్‌-19 జ‌ట్లు రెండో మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా అండ‌ర్‌-19 జ‌ట్టు భార‌త బౌల‌ర్ల ధాటికి 49.3 ఓవ‌ర్ల‌లో 245 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ ముందు 246 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో జాసన్ రౌల్స్ (114; 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగాడు. డేనియల్ బోస్మాన్ (31), అద్నాన్ లగాడియన్ (25) లు ప‌ర్వాలేద‌నిపించ‌గా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు.

Shreyas Iyer : ముంబై కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. కివీస్ సిరీస్‌కు ముందు అయ్య‌ర్‌కు ప‌రీక్షే..

భార‌త బౌల‌ర్ల‌లో కిషన్ కుమార్ సింగ్ నాలుగు వికెట్లు తీశాడు. ఆర్ఎస్ అంబ్రిష్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.