హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా బెంగళూరు జట్టుతో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మోత మోగించింది. ఇప్పటి వరకూ ఆ జట్టు సాధించనంత అత్యధిక స్కోరును నమోదు చేసి రికార్డు సృష్టించింది. 2017 హైదరాబాద్ వేదికగా కోల్‌కతా జట్టుతో ఆడిన మ్యాచ్‌లో 209 పరుగులు సాధించిన రైజర్స్ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 231 పరుగులు నమోదు చేసింది.
Read Also : ఓ హాస్పిటల్.. 9మంది నర్సులు.. ఒకేసారి ప్రెగ్నెన్సీ
దాంతో పాటుగా ఐపీఎల్‌లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనర్లుగానూ చరిత్ర సృష్టించారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్లు గౌతం గంభీర్- క్రిస్ లిన్ పేరిట ఉన్న 184 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని బద్దలు కొట్టారు సన్‌రైజర్స్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్-జానీ బెయిర్ స్టోలు. 185 పరుగులతో రికార్డు నమోదు చేశారు.
ఉప్పల్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆరంభం నుంచి దూకుడుగానే సాగింది. దాదాపు మ్యాచ్ స్కోరు మొత్తం ఓపెనర్లే పూర్తి చేశారు. బెయిర్ స్టో(114), వార్నర్(100)పరుగులతో స్కోరును పరుగులు పెట్టించారు. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.
Read Also : జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా : జగన్