సిడ్నీ టెస్టు : కష్టాల్లో ఆసీస్

  • Published By: madhu ,Published On : January 5, 2019 / 04:40 AM IST
సిడ్నీ టెస్టు : కష్టాల్లో ఆసీస్

సిడ్నీలో తిరుగులేని స్థితిలో భారత్.
తొలి ఇన్నింగ్స్‌లో 622/7 డిక్లేర్డ్
పంత్ భారీ శతకం
తృటిలో పుజారా డబుల్ సెంచరీ మిస్
మెరిసిన జడేజా

సిడ్నీ : కల సాకారమవుతుందా ? ఆసీస్ గడ్డపై రికార్డులు సృష్టించిన టీమిండియా మరో విజయానికి తహతహలాడుతోంది. సిడ్నీ టెస్టులో భారత్ తిరుగులేనిస్థితిలో నిలిచింది. భారత్‌ని అడ్డుకోవడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా కేవలం డ్రా కోసమే పోరాడమే తప్ప ఏమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 
చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్ చేసిన చాంతాండ స్కోరుతో కంగారు బెంబేలెత్తితిందో ఏమో ఆసీస్ బ్యాట్ మెన్స్ వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. ప్రధానంగా కుల్ దీప్ యాదవ్ ఆసీస్ నడ్డి విరిచాడు. ఇతను మూడు వికెట్లు తీశాడు.  
ఆసీస్ ఓపెనర్ హరీష్ (79) సత్తా చాటాడు. 152 పరుగులకు ఆసీస్ 4 ప్రధాన వికెట్లను కోల్పోయింది. ట్రావిస్ హెడ్ – హాండ్స్ కాంబ్ జోడిని భారత బౌలర్లు విడగొట్టారు. భారత బౌలర్లను ఇబ్బంది పెట్టిన ట్రావిన్ హెడ్‌ని కుల్ దీప్ వెనక్కి పంపించాడు. 198 పరుగుల వద్ద ఫైన్ (5) అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ప్రస్తుతం హాండ్స్ కాంబ్ 21 రన్లతో క్రీజులో ఉన్నాడు. 
భారత బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ 3, జడేజా 2, షమీ 1 వికెట్ తీశారు. 
ఇండియా మొదటి ఇన్నింగ్స్ : 622/7.